దేశంలోనే రెండో అతిపెద్ద జాతర.. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఏర్పాట్లు

by Gantepaka Srikanth |   (  Updated:2025-01-27 15:33:07  IST  )

దిమ గిరిజనుల ప్రాచీన సంస్కృతీ, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే నాగోబా జాతర(Nagoba Jatara) ఉత్సవాలకు ప్రారంభ సూచకంగా నిర్వహించే మహాపూజ

దేశంలోనే రెండో అతిపెద్ద జాతర.. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఏర్పాట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆదిమ గిరిజనుల ప్రాచీన సంస్కృతీ, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే నాగోబా జాతర(Nagoba Jatara) ఉత్సవాలకు ప్రారంభ సూచకంగా నిర్వహించే మహాపూజను పురస్కరించుకుని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) గిరిజనులకు శుభాకాంక్షలు తెలిపారు. నాగోబా జాతరను పురస్కరించుకుని గిరిజనులు అత్యంత నిష్టతో ఆచరించే పూజా విధానం గొప్పదని మంత్రి అన్నారు. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 4 వరకు 8 రోజుల పాటు ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్‌(Keslapur)లో నిర్వహించే ఆదిశేషుని నాగోబా జాతర దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతర కావడం తెలంగాణకు ప్రత్యేకతను తెచ్చిపెట్టందని మంత్రి సురేఖ అన్నారు. దేశంలోని వేర్వేరు రాష్ట్రాల నుంచి జాతరకు తరలి వచ్చే గిరిజన భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి తెలిపారు.

నాగోబా దయతో రాష్ట్రం పాడిపంటలతో వర్ధిల్లాలని, సదా శాంతి సౌభాగ్యాలు నెలకొనాలని మంత్రి సురేఖ ఆకాంక్షించారు. కాగా, ములుగు జిల్లాలోని సమ్మక్క-సారక్క జాతర ఆదివాసీల తెగువకు ప్రతీకైతే.. ఆదిలాబాద్‌ జిల్లా(Adilabad Dist)లోని నాగోబా జాతర వారి సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపడుతుంది. ప్రతి ఏటా పుష్యమి నెలవంక రెండో రోజున చెకడ పేరిట నిర్వహించే ప్రచారంతో జాతర ప్రారంభమవుతుంది. పుష్యమి అమవాస్య అర్ధరాత్రి జరిపే మహాపూజతో ప్రజ్వలితమవుతుంది. అంతటి ప్రాశస్త్యం కలిగిన నాగోబా జాతర నిర్వహణకు ప్రభుత్వాలు అందించే తోడ్పాటు కీలకం. రేపు జనవరి 28న మహాపూజతో ఈ మహా జాతర ప్రారంభం కాబోతోంది.

రేపు రాత్రి నాగోబాకు మెస్రం వంశీయులు మహాపూజ చేయనున్నారు. ఈ నాగోబా జాతరకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. 600 మంది పోలీసులు.. 100 సీసీ కెమెరాలతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. నాగోబా జాతర సందర్భంగా భక్తులకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు చెప్పారు. దేశంలో రెండో అతి పెద్ద గిరిజన జాతరగా అభివర్ణించారు.

Next Story