టీఆర్ఎస్‌లో మహిళా మంత్రి శపథం నెరవేరుతుందా?

by Disha Web Desk 2 |
టీఆర్ఎస్‌లో మహిళా మంత్రి శపథం నెరవేరుతుందా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు హామీలతో అదరగొడుతుంటారు. సవాళ్లతో ప్రత్యర్థులను బెదరగొడుతుంటారు. మరి కొందరైతే శపథం చేస్తూ రాజకీయ పోరును మరింత రసవత్తరంగా చేస్తారు. గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన శపథం గురించి అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు తాను గడ్డం తీసుకోనని ఆయన చేసిన శపథంపై టీఆర్ఎస్ నేతలు ఎద్దేవా చేశారు. అయితే తాజా ఓ టీఆర్ఎస్ మహిళా మంత్రి సైతం శపథం చేసి ఆ మాటకు కట్టుబడి వ్యవహరిస్తుండటం హాట్ టాపిక్‌గా మారింది. ఆమె.. మంత్రి సత్యవతి రాథోడ్. ఇటీవల హైదరాబాద్‌లో గిరిజన, ఆదివాసి ఆత్మగౌరవ భవన ప్రారంభోత్సవ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ శపథం చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ముడోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరోసారి పార్టీ అధికారంలోకి వచ్చే వరకు తాను చెప్పులు ధరించనని శపథం చేశారు.

దాంతో అప్పటి నుంచి ఆమె చెప్పులు తొడగకుండానే కనిపిస్తుండటం గులాబీ పార్టీలో ఆసక్తిగా మారింది. ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌కు మద్దతుగా సత్యవతి రాథోడ్ ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా కాళ్లకు చెప్పులు లేకుండానే ప్రచారం కొనసాగిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన శపథంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా సెటైర్లు వేశారు. 2018 ఎన్నికల్లో అయినా తన ప్రతిజ్ఞకు ఫలితం లభిస్తుంని అనుకున్న ఉత్తమ్‌కు నిరాశే మిగిలింది. దాంతో ఆయన ఇప్పటికీ గడ్డంతోనే ఉంటున్నారు. అయితే వచ్చే ఎన్నికలు టగ్ ఆఫ్ వార్‌గా సాగనున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ అధికార టీఆర్ఎస్‌ను కార్నర్ చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సత్యవతి రాథోడ్ శపథం నెరవేరుతుందా లేదా అనేది ఆసక్తి రేపుతోంది.

ఇవి కూడా చ‌ద‌వండి

1.రాజగోపాల్ చేసిన తప్పు వెంకట్ రెడ్డి చేయొద్దు: వీహెచ్



Next Story

Most Viewed