తూర్పు ప్రజలు చైనీయుల్లా ఉంటారు.. శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై మణిపూర్ సీఎం ఫైర్

by Disha Web Desk 12 |
తూర్పు ప్రజలు చైనీయుల్లా ఉంటారు.. శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై మణిపూర్ సీఎం ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో పార్లమెంట్ ఎన్నికల వేళ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. "తూర్పు ప్రజలు చైనీస్ లాగా, దక్షిణాదిలో ఆఫ్రికన్ లా కనిపిస్తున్నారని పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై మణిపూర్ సీఎం ఎన్ బీరేన్ సింగ్ ఫైర్ అయ్యారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమని, భారత భౌగోళిక కూర్పు తనకు తెలియదని ఆయన వెల్లడించారు. అలాగే వారిది పూర్తిగా దేశాన్ని విభజించి పాలించే మనస్థత్వమని ఆరోపించారు. అలాగే మేము భారతదేశంలో ఒక భాగమే, భారతదేశంలో మొత్తం ప్రజలు భారతీయులే అని సీఎం బీరేన్ సింగ్ చెప్పుకొచ్చారు.

కాగా ఈరోజు ఉదయం శామ్ పిట్రోడా దేశంలో వైవిధ్యం గురించి మాట్లాడుతూ.. ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి మనం ఒక ప్రకాశవంతమైన ఉదాహరణ.. తూర్పున ఉన్న ప్రజలు చైనీస్‌లా కనిపిస్తారు, పశ్చిమంలో ప్రజలు అరబ్‌లా కనిపిస్తారు. ఉత్తరాది ప్రజలు తెల్లవారిలా, దక్షిణాది ప్రజలు ఆఫ్రికన్‌లా కనిపిస్తారంటూ వివాదాస్సద వ్యాఖ్యలు చేశారు. గత నెలలో, సంపద పునర్విభజనపై పిట్రోడా చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా వైరల్ కావడంతో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో పిట్రోడా వారసత్వపు పన్నుకు సంబంధించి తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చాడు.

Next Story