- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జూబ్లీహిల్స్‌కు వస్తేనే ప్రచారం చేసినట్లా?.. MP అర్వింద్ ఫైర్
జూబ్లీహిల్స్‌కు వస్తేనే ప్రచారం చేసినట్లా?.. MP అర్వింద్ ఫైర్

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్(Jubilee Hills By-Election)లో ప్రచారంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్(MP Dharmapuri Arvind) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను జూబ్లీహిల్స్‌కు రాకపోయినా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నానని అన్నారు. జూబ్లీహిల్స్‌లో పర్యటిస్తూ ప్రచారం చేసేవాళ్లకంటే నా మాటలే క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి బలంగా వెళుతున్నాయని అన్నారు. జూబ్లీహిల్స్‌కు వచ్చి ప్రచారం చేస్తేనే చేసినట్లు కాదు.. ఎక్కడి నుంచి చేసినా చేసినట్లే అని చెప్పారు. నిజామాబాద్‌లో పార్టీ బలంగా ఉందనే విషయాన్ని అంతా తమనించాలని హితవు పలికారు. అనవసరంగా ప్రచారానికి రాలేదని నాపై కంప్లైంట్ చేయొద్దు అని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అంతకుముందు కేసీఆర్ కుటుంబంపై ఎంపీ అర్వింద్ రెచ్చిపోయారు. కేసీఆర్ అధికారంలో ఉన్న పదేళ్లు లెక్కలేనన్ని పాపాలు చేశారన్నారు. కాళేశ్వరాన్ని కట్టి లక్ష కోట్ల రూపాయలు ముంచేసి సముద్రం పాలు చేశాడని, తెలంగాణను అప్పులపాలు చేశాడని దుమ్మెత్తి పోశారు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసు, రియల్ ఎస్టేట్ స్కామ్ వంటి ఎన్నో కేసుల్లో రేవంత్ సర్కారు ముందుకెళ్లలేని దుస్థితిలో ఉందన్నారు. రేవంత్ రెడ్డి అసమర్థుడని అర్వింద్ అన్నారు. రేవంత్ రెడ్డి కేసీఆర్‌తో ములాఖత్ అయ్యారని అర్వింద్ ఆరోపించారు. నిజామాబాద్ మార్కెట్ యార్డులో వస్తున్న ఆదాయాన్ని అంతా కేసీఆర్ హయాంలో సిరిసిల్ల, సిద్దిపేట లకే తీసుకెళ్లారని విమర్శించారు.






