సీఎం జగన్‌తో కేసీఆర్ కుమ్మక్కు.. బండి సంజయ్ తీవ్ర విమర్శలు

by Disha Web Desk 19 |
సీఎం జగన్‌తో కేసీఆర్ కుమ్మక్కు.. బండి సంజయ్ తీవ్ర విమర్శలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కృష్ణ నది నీటి పంపకాల వివాదంలో కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడంతో తన బండారం బయటపడుతుందని సీఎం కేసీఆర్ భయపడుతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆరోపించారు. ఏపీ సీఎం జగన్‌తో కుమ్మక్కై దక్షిణ తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసిన చరిత్ర కేసీఆర్‌దని విమర్శించారు. శనివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన రైతు సదస్సులో బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన బండి.. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటే అని.. ఎన్నికల కోసమే బీఆర్ఎస్ నేతలు విచ్చలవిడిగా గంజాయి డ్రగ్స్ అందిస్తున్నారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో వేయాలని త్రి ప్లస్ త్రి సిక్స్.. బీఆర్ఎస్ ఇంటికి పోవడం ఫిక్స్ అన్నారు. ప్రవళిక ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబానికి మనోధైర్యం నింపకుండా లవ్ ఫెయిల్యూర్ అని చెబుతున్నారని ఇదేం బతుకు కేసీఆర్ అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. నిరుద్యోగులకు బీజేపీ అండగా ఉంటుందన్నారు.

Next Story

Most Viewed