- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM KCR, కేటీఆర్‌లపై ఎంపీ అర్వింద్ అనుచిత వ్యాఖ్యలు (వీడియో)
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లపై నిజామాబాద్ ఎంపీ, కోరుట్ల బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మపురి అర్వింద్ అనుచిత వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లపై నిజామాబాద్ ఎంపీ, కోరుట్ల బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మపురి అర్వింద్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు చేసిన వ్యాఖ్యల్లో మున్నూరు కాపులు, ముదిరాజ్, బేస్త కులస్తులను అవమానించారన్నారు. దీనికి గానూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఈ మూడు కులాలకు వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు.
లేని పక్షంలో కొడుకుల్లారా.. మొత్తం రోడ్ల మీదకు అందరం వచ్చి మీ భరతం పడతారన్నారు. మస్తికెక్కిన్నార్రా.. అరేయ్ కేసీఆర్, అరేయ్ కేటీఆర్ అంటూ ఫైర్ అయ్యారు. ‘మూడు కులాలకు గంటలోగా సారీ చెప్పకుంటే చెప్పు తీసుకుని కొడతా’ అన్నారు. ఎవడ్రా ముఖ్యమంత్రి మేము చేస్తే సీఎం అయ్యాడు మీ అయ్యా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే అంతకుముందు సోషల్ మీడియాలో విద్యాసాగర్ రావు మాట్లాడిన ఓ వీడియోను అర్వింద్ షేర్ చేశారు. అందులో ఎంపీ అర్వింద్‌ను విద్యాసాగర్ రావు పరుషపదజాలంతో విమర్శించారు.






