లిక్కర్ కేసులో ట్విస్ట్.. ఫోన్లు మీడియాకు చూపించిన కవిత

by Disha Web Desk 2 |
లిక్కర్ కేసులో ట్విస్ట్.. ఫోన్లు మీడియాకు చూపించిన కవిత
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాసేపట్లో ఈడీ విచారణకు హాజరు కానున్నారు. విచారణకు హాజరయ్యేందుకు వాహనం వద్దకు వచ్చిన కవితను మీడియా ప్రతినిధులు చుట్టుముట్టారు. ఈ క్రమంలో తాను ఫోన్లు ధ్వంసం చేయలేదని, తన వద్ద ఉన్న ఫోన్లను మీడియాకు చూపించారు. అనంతరం ఉదయం భేటీ అయిన సుప్రీంకోర్టు లాయర్లో కవిత ఈడీ ఆఫీసుకు బయల్దేరారు. కాగా, సెప్టెంబర్ 2021 నుంచి ఆగస్టు 2022 వరకు కవిత 10 ఫోన్లు వాడినట్లు, ధ్వంసం కూడా చేసినట్లు ఈడీ అభియోగం ఉంది. ఈ కేసులో మొత్తం 36 మంది 170 ఫోన్లు మార్చారని ఈడీ అభియోగాలు ఉన్నాయి. స్పెషల్ కోర్టుకు దాఖలు చేసిన ప్రాసిక్యూషన్‌ కంప్లైంట్‌లో కవిత 10 ఫోన్లు వాడినట్లు ఈడీ స్పష్టంగా తెలిపింది. దీంతో ఈడీ అభియోగాల నేపథ్యంలోనే కవిత తన ఫోన్లను మీడియాకు చూపించినట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed