- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు హస్తినకు మంత్రి ఉత్తమ్ పయనం.. కేంద్ర మంత్రులతో నీటి ప్రాజెక్టులు, ధాన్యం సేకరణపై భేటీ
తెలంగాణ రాష్ట్ర జల వనరులు, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి (Minister Uttam Kumar Reddy) ఇవాళ హస్తినకు వెళ్లనున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర జల వనరులు, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి (Minister Uttam Kumar Reddy) ఇవాళ హస్తినకు వెళ్లనున్నారు. రాష్ట్రంలోని పలు కీలక నీటిపారుదల ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలంటూ కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రి భూపేంద్ర యాదవ్ (Bhupendra Yadav)ను కలవనున్నారు. ఈ భేటీలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న నీటి ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులు, అటవీ భూములు, గౌరవెల్లి ప్రాజెక్ట్‌కు పర్యావర పర్యావరణ అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. అయితే, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ పోలవరం ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇప్పటికే కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌కు ఆ ప్రాజెక్ట్‌కు ఎలాంటి అనుమతి ఇవ్వవద్దని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాజెక్టు స్కోప్‌ను మార్చి, గోదావరి జలాల వాటాలు, పర్యావరణ నిబంధనలు ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. అదేవిధంగా తెలంగాణకు చెందిన ప్రాజెక్టులకు త్వరితగతిన క్లియరెన్స్‌లు ఇవ్వాలని మంత్రి కోరనున్నారు.
అదేవిధంగా మంత్రి ఉత్తమ్ రేపు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రి ప్రహ్లాద్ జోషి (Prahlad Joshi)ని ఉత్తమ్ కుమార్ రెడ్డి కలవనున్నారు. తెలంగాణ నుంచి వరి ధాన్యం సేకరణపై చర్చించనున్నారు. 2025-26 ప్రస్తుం ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం ఉత్పత్తి 148 లక్షల మెట్రిక్ టన్నులుగా అంచనా వేయగా.. కేంద్రం నిర్దేశించిన 54 లక్షల మెట్రిక్ టన్నుల టార్గెట్ 80 LMTకు పెంచాలని మంత్రి కోరనున్నారు. ఇప్పటికే 52 LMT ధాన్యం సేకరించినట్లు అధికారులు తెలిపారు. డిసెంబర్ 15న ప్రహ్లాద్ జోషికి రాసిన లేఖలో ఉత్తమ్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. రైతులు దిగుబడి అమ్మకాల్లో ఇబ్బందులు పడకుండా టార్గెట్ పెంచాలని, పెండింగ్ బకాయిలను క్లియర్ చేయాలని కోరారు. ఇక కస్టమ్ మిల్డ్ రైస్ (CMR) సమర్పణ గడువును 2026 జనవరి 31 వరకు పొడిగించాలని, పార్‌బాయిల్డ్ రైస్ రవాణాకు అదనపు రేక్‌లు కేటాయించాలని మంత్రి ఉత్తమ్, ప్రహ్లాద్ జోషికి విన్నవించారు.






