జూన్ 2న అమరవీరుల స్మారక కేంద్రం ప్రారంభోత్సవం

by Disha Web Desk 2 |
జూన్ 2న అమరవీరుల స్మారక కేంద్రం ప్రారంభోత్సవం
X

దిశ, తెలంగాణ బ్యూరో: సచివాలయం సమీపంలో నిర్మించిన అమరవీరుల స్మారక మందిరాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ జూన్ 2వ తేదీన లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఆ రోజు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కావడంతో స్వయంగా కేసీఆరే ఈ మందిరానికి ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నా అధికారికంగా మాత్రం ప్రభుత్వం ప్రకటన విడుదల చేయలేదు. ప్రస్తుతం ఈ స్మారక మందిరం పనులు ఏ దశలో ఉన్నాయో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. పలు సూచనలు చేయడంతో పాటు పనులను స్పీడప్ చేయాలని ఇంజనీర్లను ఆదేశించారు. ప్రజల హృదయాలను హత్తుకునే విధంగా డిజైన్, నిర్మాణం జరిగినందున తుది మెరుగుల పనులు సత్వరం పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

ప్రధాన ద్వారం,ల్యాండ్ స్కేప్ ఏరియా, పార్కింగ్ ఏరియా, తెలంగాణ తల్లి విగ్రహం, ఫౌంటైన్ ఏరియా, గ్రానైట్ ఫ్లోరింగ్, ఫోటో గ్యాలరీ, ఆడియో, విజువల్ రూం, లిఫ్ట్ లు, ఎస్కలేటర్, కన్వెన్షన్ సెంటర్, పై అంతస్థులోని రెస్టారెంట్, నిరంతరం జ్వలించే జ్వాలలా ఉండే జ్యోతి ఆకృతి.. వీటన్నింటి పనులను పరిశీలించారు. ప్రపంచంలోనే అరుదైన డిజైన్‌తో దుబాయ్ నుంచి తెప్పించిన ప్రత్యేక రకా (గ్రేడ్ 316 ఎల్)నికి చెందిన స్టెయిన్ స్టీల్‌ని వినియోగించారు ఇంజనీర్లు. దాదాపు నిర్మాణం మొత్తం పూర్తయిని ఫినిషింగ్ టచ్ పనులు మాత్రం జరుగుతున్నాయి. రాష్ట్ర సాధన కోసం కొట్లాడి ప్రాణాలిచ్చిన అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకునే నిర్మాణం జరిగినట్లు మంత్రి వివరించారు.

Next Story

Most Viewed