పోలీసులపై మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 4 |
పోలీసులపై మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రి మల్లారెడ్డి మరోసారి కాంట్రవర్సీ గా మారారు. పోలీసులకు బొర్ర ఉంటే ప్రమోషన్లు ఇవ్వొద్దంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ సమావేశంలో హోం మంత్రి మహమూద్ అలీ, డీజీపీ అంజన్ కుమార్ ఎదుటే మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పోలీస్ దేశంలోనే నెంబర్ వన్ గా ఉందని అయితే పోలీసులు మంచి ఫిట్ నెస్ తో ఉండాలన్నారు. పోలీస్ అంటేనే దొంగలు భయపడేలా ఉండాలని అందుకోసం ప్రతి పోలీస్ స్టేషన్ లలో జిమ్ లు ఏర్పాటు చేయాలని సూచించారు. కాగా బొర్ర ఉన్న పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వక్కుండా రూల్ తేవాలంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలు సంచలనం అవుతున్నాయి.

నిజానికి పొలీసుల్లో అధిక బరువు సమస్యపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. పోలీసులు ఫిట్ గా ఉండాలని కొంతమంది వాదిస్తుంటే వయసురీత్యా అనారోగ్యంతో అధిక బరువు సమస్యతో బాధపడుతున్న పోలీసులకు ఇలాంటి వ్యాఖ్యలు మానసికంగా వేధించినట్లు అవుతుందని మరి కొంత మంది వాదిస్తున్నారు. మొత్తంగా మల్లారెడ్డి వ్యాఖ్యలపై పోలీసువర్గాలు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి. మరోవైపు ఇటీవల అసోం ప్రభుత్వం సైతం లావుగా ఉన్న పోలీసుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. లావుగా ఉన్న పోలీసులకు స్వచ్ఛంద పదవీ విరణ కల్పిస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వశర్మ ఇటీవల ప్రకటించారు.

Also Read.. వచ్చే ఎన్నికల్లో మంత్రి తలసాని గెలుపు కష్టమే!

‘కాంగ్రెస్ అంపైరింగ్.. బీఆర్ఎస్ ఎంఐఎం షాడో బాక్సింగ్’


Next Story

Most Viewed