డబుల్ ఇంజన్ కాదు.. డబుల్ ఇంపాక్ట్ సర్కార్ కావాలి: కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
డబుల్ ఇంజన్ కాదు.. డబుల్ ఇంపాక్ట్ సర్కార్ కావాలి: కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశానికి ఇప్పడు కావాల్సింది డబుల్ ఇంజన్ సర్కార్ కాదు.. డబుల్ ఇంపాక్ట్ సర్కార్ అని మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జల దృశ్యం నుంచి సుజల దృశ్యం దాకా బీఆర్ఎస్ పార్టీ ప్రగతి ప్రస్థానం కొనసాగుతోందన్నారు. డేటా లేకుండా చేసే పాలన అనేది కరెక్టు కాదు.. అందుకే రాష్ట్రం ఏర్పాటు కాగానే సకల జనుల సర్వే నిర్వహించి జనాభా గణాంకాలతో అభివృద్ధిని సీఎం సుసంపన్నం చేశారన్నారు. దేశంలో 2.8 శాతం జనాభా కలిగిన తెలంగాణ అభివృద్ధి సంక్షేమంలో పంచాయితీరాజ్ శాఖలో 30శాతం అవార్డులను సొంతం చేసుకున్నదన్నారు. పల్లెలే కాదు పట్టణాలు కూడా గుణాత్మక అభివృద్ధిని నమోదు చేసుకుంటున్నాయని, పారిశ్రామీకరణ పర్యావరణ హితంగా కొనసాగుతున్నదని స్పష్టం చేశారు.

ధాన్యం దిగుబడి విపరీతంగా పెరిగిందని, విద్య వైద్యంతో పాటు గురుకులాలు ఏర్పాటు వేరే ఏ రాష్ర్ట్రంలో కూడా ఇంతగా లేవు అని, దేశ 75 ఏండ్ల స్వాతంత్ర్య చరిత్రలో.. తెలంగాణ రాష్ట్రం భారత దేశంలో ఓకే ఒక స్టార్టప్ స్టేట్ ఎదిగిందన్నారు. దేశంలో సహజ వనరులను వాడుకునే తెలివున్న ప్రభుత్వాలే లేవు అన్నారు. సస్య విప్లవం, వ్యవసాయ విప్లవం, గులాబీ విప్లవం(పశు సంపద అభివృద్ధి), శ్వేత విప్లవం, నీలి విప్లవం ఇట్లా 5 విప్లవాలతో ప్రగతిని సాధిస్తున్నదన్నారు. యువతను రాజకీయాల దిశగా చైతన్యం చేయాల్సిన అవసరం మనందరిపై ఉందన్నారు. అప్పులు తేవడం అనేది ఏదో తప్పుగా మాట్లాడుతున్న వారు.. ప్రపంచంలో అత్యంత అప్పులున్న దేశాలు.. అదే సందర్భంగా అత్యంత ధనవంతమైన దేశాలు రెండూ కూడా అమెరికా, జపాన్ అన్న సంగతి.. ఈ కువిమర్మకులకు అర్థం కావాల్సి ఉందని మండిపడ్డారు.



Next Story

Most Viewed