పవన్ కళ్యాణ్‌ను చూసి సీఎం సీఎం అంటూ నినాదాలు.. జనసేనాని రియాక్షన్ ఇదే..

by Sujitha |
పవన్ కళ్యాణ్‌ను చూసి సీఎం సీఎం అంటూ నినాదాలు.. జనసేనాని రియాక్షన్ ఇదే..
X

దిశ, సినిమా : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాక్ ఆఫ్ ది నేషన్ అయిపోయాడు. ఆయన గెలవాలని తెలుగు రాష్ట్రాల ప్రజలు, తెలుగు హీరోలు, హీరోయిన్లు మాత్రమే కాదు బాలీవుడ్, కోలీవుడ్ నుంచి కూడా సపోర్ట్ ఇచ్చారు. ఈసారి ఆయన విజయం ఖాయం కావాలని కోరుకున్నారు. మెగా హీరోలు కూడా ఒక్కొక్కరు ఒక్కోరోజు ఆయనకు మద్దతుగా క్యాంపెయిన్ నిర్వహించారు. మెగా బ్రదర్ నాగబాబు ఆయన వెన్నంటే ఉండగా..మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా ప్రజలకు సందేశాలు ఇస్తూనే ఉన్నాడు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన తల్లి సురేఖతో కలిసి స్టార్ క్యాంపెయినర్‌గా మారగా.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఆయన బాధ్యత నిర్వహించాడు. ఇక మెగా కోడళ్లు ఉపాసన, లావణ్య కూడా సామాజిక మాధ్యమాల ద్వారా పవన్‌కు ఓటు వేయాలని సపోర్ట్ ఇస్తూ వచ్చారు.

మొత్తానికి ప్రస్తుతం పోలింగ్ కొనసాగుతుండగా.. మంగళగిరిలో భార్యతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నాడు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో అక్కడకు చేరుకున్న అభిమానులు సీఎం.. సీఎం.. అంటూ నినాదాలు చేశారు. అయినా సరే ఆయన సైలెంట్‌గానే ఉండిపోయాడు పవర్ స్టార్. ఇక ఆయనను చూసేందుకు జనాలు సైతం భారీగా తరలిరాగా.. ఆ ప్రాంతం సందడిగా మారింది. కాగా పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా.. మంగళగిరిలో ఓటు ఉండటం వల్ల అక్కడే ఓటు వేశాడు.

Next Story

Most Viewed