ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదు: మంత్రి కొండా సురేఖ వార్నింగ్

by Disha Web Desk 19 |
ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదు: మంత్రి కొండా సురేఖ వార్నింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇసుక అక్రమాలపై ఫోకస్ పెడతామని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. భద్రాద్రి జిల్లా ఇల్లందు ఫారెస్ట్ డివిజన్ రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతం నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్న మాఫియాను అడ్డుకునేందుకు వెళ్లిన ఫారెస్ట్ అధికారులపై ట్రాక్టర్ ఎక్కించి చంపడానికి చేసిన కుట్రలను ఆమె తీవ్రంగా ఖండిస్తూ ఓ ప్రకటన రిలీజ్ చేశారు. అధికారులపై దాడులు చేయడం సరికాదన్నారు. ఇసుక దోపిడిపై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నదని, పూర్తి స్థాయిలో నిఘా పెడతామని పేర్కొన్నారు.

ఈ ఘటనలో దోషులు ఎంతటి వారైనా ఉపేక్షించమని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజా ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని, పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి నివేదిక ఇవ్వాలని మంత్రి కోరారు. అటవీ ప్రాంతంలో గతంలో జరిగిన దాడుల దృష్ట్యా అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నదని, ప్రభుత్వం నుంచి అన్ని సహాయ సహకారాలు అందుతాయని స్పష్టం చేశారు.


Next Story

Most Viewed