- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతులకు గుడ్ న్యూస్.. రూ.2 లక్షల రుణమాఫీపై మంత్రి కోమటిరెడ్డి కీలక ప్రకటన
రూ.2 లక్షల రైతు రుణమాఫీ అమలుపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ సర్కార్ హామీ ఇచ్చినట్లుగా ఆగస్ట్ 15న

దిశ, వెబ్‌డెస్క్: రూ.2 లక్షల రైతు రుణమాఫీ అమలుపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ సర్కార్ హామీ ఇచ్చినట్లుగా ఆగస్ట్ 15న నాటికి రైతులకు రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేసి తీరుతామని ఆయన మరోసారి స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కల సాకారం అయ్యిందని.. ఎవరూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజమని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణను కేసీఆర్ పదేళ్లు దోచుకున్నారని ఫైర్ అయ్యారు.
బతుకమ్మ చాటున లిక్కర్ దందా చేసిన వ్యక్తి కవిత అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ 9 నుండి 13 ఎంపీ సీట్లు గెలవబోతుందని ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి ఒక్క ఎంపీ సీటు కూడా రాదని జోస్యం చెప్పారు. జూన్ 4 లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతోందని అన్నారు. కేంద్రంలో పదేళ్లు అధికారంలోకి ఉన్న ప్రధాని మోడీ నల్లధనాన్ని దేశానికి తెప్పిస్తానని మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో అంబానీ, అదానీ ఏఏ ట్యాక్స్ నడుస్తోందని విమర్శించారు.






