కేసీఆర్ కోసం మంత్రి సత్యవతి రాథోడ్ మృత్యుంజయ హోమం

by Disha Web Desk 4 |
కేసీఆర్ కోసం మంత్రి సత్యవతి రాథోడ్ మృత్యుంజయ హోమం
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్‌కు అనారోగ్య సమస్యలన్నీ తొలగి సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తూ రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తన కుటుంబ సభ్యులతో కలిసి మంత్రుల నివాస ప్రాంగణంలో వేదపండితులతో మృత్యుంజయ హోమం నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఇటీవల హఠాత్తుగా అనారోగ్యం పాలై ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ పరిస్థితి నుంచి బయటకు రావాలని, సంపూర్ణ ఆయురారోగ్యాలతో కొనసాగాలని మృత్యుంజయ హోమం జరిపారు. ఉదయం 5 గంటలకు ప్రారంభమైన మృత్యుంజయ హోమం పూర్ణాహుతికి రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఎర్రబెల్లి దయాకర్ రావు , రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు, రాష్ట్ర షెడ్యూల్ తెగల, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, మహబూబాబాద్ ఎంపీ శ్రీమతి మాలోతు కవిత పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, సురభి వాణీ దేవి, తక్కెళ్లపల్లి రవీందర్ , ఎమ్మెల్యేలు గండ్ర వెంకట రమణా రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి , మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి , మహబూబాబాద్ జడ్పీ చైర్ పర్సన్ కుమారి బిందు, ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ ఉషా దయాకర్ రావు, టీఆర్ఎస్ నేతలు కొంపల్లి శ్రీనివాస రెడ్డి, శ్రీధర్ రెడ్డి, నూకల శ్రీరంగారెడ్డి, సురేశ్ రావు, శ్రీరామ్ నాయక్, సిరి నాయక్, శ్రీమతి వనజా శ్రీరామ్, తదితరులు హాజరై,తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.



Next Story