అల్వాల్ To ఆస్ట్రేలియా.. లుంగీల మాటున రూ.9 కోట్ల డ్రగ్స్ స్మగ్లింగ్

by Disha Web Desk 7 |
అల్వాల్ To ఆస్ట్రేలియా.. లుంగీల మాటున రూ.9 కోట్ల డ్రగ్స్ స్మగ్లింగ్
X

దిశ, అల్వాల్: హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకొని ఆస్టేలియా, న్యూజిలాండ్ దేశాలకు డ్రగ్స్‌ను కొరియర్ ద్వారా తరలిస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాను రాచకొండ ఎస్ఓటీ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి రూ.9 కోట్ల విలువ చేసే 8.5 కేజీల సుడోపెడ్రిన్ అనే సింథటిక్ డ్రగ్‌ను స్వాదీనం చేసుకుని ఐదుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

తమిళనాడు రాష్ట్రానికి చెందిన రహీమ్, ఫరీద్, ఫైసల్ అనే వ్యక్తులు ప్రధాన సుత్రదారులుగా కొనసాగుతూ హైదరాబాద్, మహారాష్ట్ర కేంద్రాలుగా ఈ సింథటిక్ డ్రగ్‌ను లుంగీల ప్యాకెట్ పేరుతో కొరియర్ ద్వారా గుట్టు చప్పుడు కాకుండా ఇతర దేశాలకు సరఫరా చేస్తున్నట్లు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ రాకెట్‌ను నాచారం పోలీసుల సహకారంతో మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు చేదించారు. ఒక కేజీ డ్రగ్‌ను బహిరంగ మార్కెట్‌లో సుమారు కోటి రూపాయాలకు విక్రయిస్తారని తెలిపారు. రాబోయే కొత్త సంవత్సర వేడుకలను దృష్టిలో పెట్టుకొని డ్రగ్స్ సరఫరా విచ్చలవిడిగా చేస్తున్నారని పోలీసులు వివరించారు. నూతన సంవత్సరం సందర్భంగా డ్రగ్స్ సరఫరా దారులపై ఉక్కు పాదం మోపనున్నట్లు కమిషనర్ తెలిపారు.


READ MORE

బహుజన రాజ్యం సాధించడం ఖాయం :RS Praveen Kumar



Next Story