ఉప్పల్ స్టేడియంకు బకెట్‌తో నీళ్లు, కుర్చీలు తెచ్చుకోండి.. నెట్టింట వైరల్ అవుతున్న మీమ్స్..

by Dishafeatures2 |
ఉప్పల్ స్టేడియంకు బకెట్‌తో నీళ్లు, కుర్చీలు తెచ్చుకోండి.. నెట్టింట వైరల్ అవుతున్న మీమ్స్..
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: 'అరే మామ.. ఇంత సర్ఫు.. అన్ని నీళ్ళు తీస్క రా.. స్టేడియంలో కుర్సి సాఫ్ చేయాల'.... ' కూర్చుంటానికి స్టూల్స్ కావాలి.. ఆఫర్‌లో ఉంటే తీసుకొని స్టేడియం కొచ్చేసేయండి'... ' కాళ్లు పైకి పెట్టుకొని మ్యాచ్ చూడండి స్టేడియంలో పాములు తిరుగుతున్నాయి అంట'.. ఉప్పల్ క్రికెట్ స్టేడియంపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మీమ్స్ ఇవి. గత రెండు రోజులుగా స్టేడియం లోపల ఏర్పాట్ల లోపాల్లోపై కొందరు ఫన్నీ ఫన్నీ మీమ్స్‌ను షేర్ చేస్తున్నారు.

క్రికెట్ మ్యాచ్ టికెట్ల అమ్మకాలు మొదలు మ్యాచ్ ఇంకొన్ని గంటల్లో ప్రారంభమవుతుందనే సందర్భం వరకు ఉప్పల్ స్టేడియంపై రకరకాల మీమ్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చూడటానికి చదవడానికి నవ్వు తెప్పించే విధంగా ఉండటంతో వీటికి షేర్స్ లైక్స్ విపరీతంగా వస్తున్నాయి.

మీమ్స్‌తో ఎందుకు ట్రోల్ చేస్తున్నారంటే..

2019 డిసెంబర్ 6 న ఉప్పల్ స్టేడియంలో వెస్టిండీస్ వర్సెస్ ఇండియా మ్యాచ్ తర్వాత ఇప్పటివరకు ఆ స్టేడియంలో ఎలాంటి అంతర్జాతీయ మ్యాచులు జరగలేదు. దీంతో స్టేడియం నిర్వహణపై అశ్రద్ధ వహించింది హెచ్సీఏ. టీ20 షెడ్యూల్లో హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ వేదికగా మ్యాచ్ జరుగుతుందని ప్రకటించి నెలలు కావస్తున్నా మ్యాచ్ ప్రారంభం వరకు కూడా ఏర్పాట్లలో నిర్లక్ష్యం వహించారు. రెండు రోజుల క్రితం వర్క్ కూడా క్రికెట్ మ్యాచ్ టికెట్ కనీస ధర రూ.850 నుంచి అత్యధికంగా 10 వేల రూపాయలకు విక్రయించింది.

వాటి అమ్మకాలపై కూడా నిజాయితీగా జరపలేదు అనే విమర్శలు మూటగట్టుకుంది. నేల టికెట్లు అమ్మకాలు జరిపి కోట్ల రూపాయలు వసూలు చేసిన కనీసం స్టేడియంలో కూర్చునేందుకు కుర్చీలను సిద్ధం చేయలేకపోయింది. కొన్ని సీట్లు విరిగిపోయి ఉండగా మరికొన్ని పూర్తిగా తొలగించబడ్డాయి. ఉన్న కొద్దిపాటి సీట్లలో దుమ్ము ధూళీ పెరిగిపోగా మరికొన్ని పక్షులు రెట్టలు వేయడంతో కనీసం ముట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాయి కుర్చీలు.

మరికొన్ని చోట్ల గతంలో గాలి వానలు రావడంతో లేచిపోయిన టాప్ ఇప్పటివరకు సరి చేయలేదు. ఒకవేళ మ్యాచ్ జరిగే సందర్భంలో వర్షం వస్తే ప్రేక్షకులు వర్షంలో తడవాల్సిందే. సోషల్ మీడియాలో వస్తున్న వ్యంగకరమైన మీమ్స్‌లపై హెచ్‌సిఏ స్పందించి సౌకర్యాలు ఏర్పాటు చేసిందా లేదా అనేది ఇంకొన్ని గంటల్లో తెలుపుతుంది.



Next Story

Most Viewed