పోలింగ్ సిబ్బంది తొలి ర్యాండమైజేషన్ పూర్తి : కలెక్టర్

by Disha Web Desk 23 |
పోలింగ్ సిబ్బంది తొలి ర్యాండమైజేషన్ పూర్తి : కలెక్టర్
X

దిశ, మేడ్చల్ బ్యూరో : లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ సిబ్బంది మొదటి రాండమైజేషన్ పూర్తి చేసినట్లు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో ఎన్ ఐ సి, వి సి హాల్ లో మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డితో కలిసి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించి పూర్తి చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులను, 2425 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన మొత్తం 13226 మందిని మొదటి విడత ర్యాండమైజేషన్ ద్వారా పోలింగ్ సిబ్బందిని కేటాయించినట్లు తెలిపారు. అందులో ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ అధికారులున్నారు. ర్యాండమైజేషన్ ద్వారా నియమించిన వారికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియ, జిల్లా విద్యాశాఖ అధికారి విజయ కుమారి, ఎన్నికల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed