టీవీ ‘రాముడు’.. పోటీ మీరట్‌లో.. మకాం ముంబైలో.. ఎందుకు ?

by Dishanational4 |
టీవీ ‘రాముడు’.. పోటీ మీరట్‌లో.. మకాం ముంబైలో.. ఎందుకు ?
X

దిశ, నేషనల్ బ్యూరో : ‘రామాయణం’ సీరియల్‌‌లో శ్రీరాముడి పాత్రలో నటించి యావత్ దేశ ప్రజల మదిని దోచిన నటుడు అరుణ్ గోవిల్. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ లోక్‌సభ స్థానం నుంచి ఆయన బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ స్థానానికి ఏప్రిల్ 26న పోలింగ్ జరిగింది. అయితే మరుసటి రోజు నుంచి అరుణ్ గోవిల్ స్థానికంగా కనిపించలేదు. దీంతో ‘‘పోలింగ్ జరిగాక అరుణ్ గోవిల్ బిచాణా ఎత్తేశారు. ఆయన పారచూట్ రాజకీయం చేస్తున్నారు. బీజేపీ నాయకులకు ఓట్లపైనే ఆసక్తి తప్ప.. ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ధ్యాసే ఉండదు’’ అంటూ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ ట్వీట్ చేశారు.

దీనిపై స్పందించిన అరుణ్ గోవిల్.. తాను మీరట్‌లో అందుబాటులో లేకపోవడానికి గల కారణాన్ని వెల్లడించారు. మీరట్‌లో పోలింగ్ ముగిసిన అనంతరం బీజేపీ అధిష్టానం ఆదేశం మేరకు తాను ముంబైకి చేరుకున్నట్లు తెలిపారు. అక్కడ ఎన్నికల ప్రచారంలో తన సేవలను పార్టీ వినియోగించుకోనుందని చెప్పారు. ‘‘గత నెల రోజులుగా నాతో పాటు మీరట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రతి బీజేపీ కార్యకర్తకు ధన్యవాదాలు. వారిని నేను మరువను. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో ప్రచారంలో బిజీగా ఉన్నాను. ఎన్నికల్లో గెలిచాక అందరం కలిసి మీరట్‌ను డెవలప్ చేద్దాం’’ అని అరుణ్ గోవిల్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.




Next Story

Most Viewed