ఐఐటీ ర్యాంకర్​ తనుషకు ఆర్థిక సహాయం

by Disha Web Desk 21 |
ఐఐటీ ర్యాంకర్​ తనుషకు ఆర్థిక సహాయం
X

దిశ, అల్వల్​: పేదరికం వెన్నంటి నడుస్తున్న చదువులో మాత్రం ఏనాడు వెనుకడుగు వేయలేదు వెంకటాపురానికి చెందిన డి.ఎల్​. తనుష. తండ్రి మృతి చెందడంతో తల్లి ఇండ్లలో పనులు చేసుకుంటూ కుటుంబాన్ని అతి కష్టం మీద నెట్టుకొస్తోంది. అయినా అవేమి తనుషాను కృంగదీయకపోగా మరింత పట్టుదలను పెంచాయి. లక్షలాది మంది విద్యార్థులు పోటీ పడే ఐఐటీ పరిక్షలో 2401వ ర్యాంక్​ సాధించి ముంబాయిలో ఉచిత సీటు సంపాదించింది. ఈ సందర్భంగా వెంకటాపురం ప్రాంతానికి చెందిన మేడ వెంకట సురేష్​ కుమార్​ తనుష విద్యాబ్యాసానికి గాను రూ.1016 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు.

ఈ సందర్భంగా సురేష్​ మాట్లాడుతూ.. సీటు ఉచితం అయినప్పటికి ముంబాయిలో చదవడం అంత సులభమేమి కాదు. కనుక దాతలు ఆర్థిక సహాయం చేసి తనుష చదువు ఆగిపోకుండా చూడాలని కోరారు. దాతలు ప్రత్యక్షంగా కలిసి గాని, బ్యాంక్​ అకౌంట్​కి గాని చేయవచ్చన్నారు. ఎస్​బీఐ బ్యాంక్​ వెంకటాపురం బ్రాంచి అకౌంట్​ నంబర్​ 41205374876 అండ్ ఐఫ్​ఎస్​సి కోడ్​: SBIN0020166. ఫోన్​ నెంబర్: 7396051221లో సంప్రదించి మీ వంతు సహాయం చేయాలని కోరారు. అనంతరం ఆర్థిక సహాయం చేసినవారికి తనుష కృజ్ఞతలు తెలిపారు.


Next Story

Most Viewed