ప్రస్తుత పరిస్థితులపై కీలక సూచనలు చేసిన జిల్లా వైద్య శాఖ అధికారి..

by Disha Web Desk 13 |
ప్రస్తుత పరిస్థితులపై కీలక సూచనలు చేసిన జిల్లా వైద్య శాఖ అధికారి..
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: వనరులు అందుబాటులో ఉన్న ప్రతీ ఆరోగ్య కేంద్రంలో యాంటీ రాబీస్, యాంటీ స్నేక్ వినెం వ్యాక్సిన్ లు అందుబాటులో ఉంచుకోవాలి మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు, డాక్టర్లు, ప్రోగ్రామ్ ఆఫీసర్లు,ప్రాథమిక ఆరోగ్య కేంద్రం , పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తి దవాఖాన వైద్యులతో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇన్ఫ్లుఎంజా వైరస్లు వ్యాప్తి కాకుండా ప్రజలు వాక్సిన్ లు వేయించుకునే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. సిపిఆర్ శిక్షణ పొందేందుకు ఆరోగ్యం , వైద్య సిబ్బందిని గుర్తించడం తో పాటుగా కార్యాచరణ ఖరారు చేయాలని తెలుపుతూ.. ప్రతి మాస్టర్ ట్రైనర్ ఒక్కో బ్యాచ్‌కి 20 చొప్పున 3 బ్యాచ్‌లలో రోజుకు 60 మంది పాల్గొనేవారికి శిక్షణ ఇవ్వాలి పేర్కొన్నారు. వీధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బంది పై చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.

Next Story

Most Viewed