- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దమ్మున్న వార్తలకు నిదర్శనం దిశ : ఎంపీ ఈటల రాజేందర్
దిశ, మేడ్చల్ బ్యూరో: మీడియా రంగంలో దిశ ప్రభంజనం సృష్టిస్తుందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.

దిశ, మేడ్చల్ బ్యూరో: మీడియా రంగంలో దిశ ప్రభంజనం సృష్టిస్తుందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. నూతన సంవత్సరం 2026 మేడ్చల్ జిల్లా క్యాలెండర్ ను ఆయన బుధవారం తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా దిశ మేడ్చల్ జిల్లా రిపోర్టర్స్ టీమ్ కు ఎంపీ అభినందనలు తెలిపారు. ప్రజా సమస్యలు వెలుగేత్తి చాటడం తో పాటు డిజిటల్ మీడియా లో ట్రెండ్ సెట్టర్ గా దిశ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేందుకు దిశ జనాసక్తితో ముందుకు వెళ్లాలని సూచించారు. అనంతరం దిశ మేడ్చల్ జిల్లా బ్యూరో చీఫ్ రవిచంద్ర ఆధ్వర్యంలో ఎంపీకీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా అర్బన్ బీజేపీ అధ్యక్షుడు మల్లారెడ్డి, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు సాదా కేశవరెడ్డి, దిశ మేడ్చల్ బ్యూరో చీఫ్ కల్లేపల్లి రవిచంద్ర, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి లింగస్వామి, ఉప్పల్ ఇంచార్జి విజయ్ కుమార్, మల్కాజిగిరి ఇంచార్జి మల్లేష్, జర్నలిస్టులు మద్దయ్య, కిరణ్ కుమార్,రాజ్ కుమార్, మధు యాదవ్, శరత్ చంద్ర, స్థానిక బీజేపీ నేతలు పాల్గొన్నారు.






