సీఎం కేసీఆర్ సారథ్యంలో అభివృద్ధి: మంత్రి మల్లారెడ్డి

by Disha web |
సీఎం కేసీఆర్ సారథ్యంలో అభివృద్ధి: మంత్రి మల్లారెడ్డి
X

దిశ, మేడ్చల్ టౌన్: సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మంగళవారం మేడ్చల్ మండలం రాజబొల్లారం గ్రామ పంచాయతీ పరిధిలోని ఘనపూర్, అక్కోజిగూడలో సుమారు రూ. 50 లక్షలతో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ఒక చరిత్ర అని కొనియాడారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో పాలిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏమి అభివృద్ధి చేస్తలేవని ఆరోపించారు. రాబోయే రోజుల్లో బీజేపీకి సరైన గుణపాఠం చెప్పేది బీఆర్ఎస్ పార్టేయేనన్నారు.

బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడ చూసిన సమస్యలే ఉన్నాయని, బీఆర్ఎస్ పాలిస్తున్న తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసిన అభివృద్ధే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, మేడ్చల్ జిల్లా రైతుబంధు అధ్యక్షుడు నందారెడ్డి, ఎంపీపీ రజిత రాజమల్లారెడ్డి, జడ్పీటీసీ శైలజ విజయానంద రెడ్డి, మేడ్చల్ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు దయానంద్ యాదవ్, మేడ్చల్ పీఏసీఎస్ చైర్మన్ రణదీప్ రెడ్డి, నాయకులు రవీందర్ గౌడ్, అనూప్ తదితరులు పాల్గొన్నారు

.


Next Story