బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలం.. బలగం: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

by Disha Web Desk 1 |
బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలం.. బలగం: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
X

దిశ, పటాన్ చెరు: బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలం... బలగం అని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బీఅర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని జీఎంఅర్ కన్వెన్షన్ హాల్లో నియోజకవర్గ బీఆర్ఎస్ ప్రతినిధుల మహాసభను నిర్వహించారు. ఈ సమావేశానికి నియోజవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీగా బయలుదేరి బాణసంచా కాల్చుతూ సంబురంగా వేదిక వద్దకు చేరుకున్నారు. వేలాదిమంది కార్యకర్తల సమక్షంలో.. శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ జెండాను ఎగరవేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రాన్ని నేడు దేశానికి దిక్సూచిగా మార్చిన మహోన్నత నాయకుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. ఆయన నాయకత్వంలో ఇంటింటికి రక్షిత మంచినీరు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు, మూడు షిఫ్టుల్లో పరిశ్రమల నిర్వహణ, ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వుల, పెరిగిన భూముల ధరలు, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్రతో ప్రతి తెలంగాణ బిడ్డ సంతోషంగా జీవిస్తున్నారని తెలిపారు.

బీఅర్ఎస్ పార్టీకి అయువు పట్టు కార్యకర్తలే అని కార్యకర్తల శ్రమ, నిజాయితీ, పట్టుదల మూలంగానే ప్రతి ఎన్నికల్లోనూ విజయం సాధిస్తున్నామని తెలిపారు. తొమ్మిదేళ్ల హయాంలో రూ.8వేల కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నామని తెలిపారు. ఒక వైపు అనునిత్యం అనుక్షణం ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి పనులు చేస్తుంటే.. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు చిల్లర రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు.

రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు చెంపపెట్టులా వారి డిపాజిట్లు గల్లంతయ్యేలా రాష్ట్ర ప్రజలు తీర్పును ఇవ్వబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, ప్రజా ప్రతినిధులు పార్టీ అధ్యక్షులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.


Next Story

Most Viewed