ఒకేషనల్ కాలేజీలో నిబంధనలకు నీళ్లు

by Disha Web Desk 12 |
ఒకేషనల్ కాలేజీలో నిబంధనలకు నీళ్లు
X

విద్యార్థులకు వృత్తి విద్యా కోర్సులు అందించే కళాశాలలు నిబంధనలకు నీళ్లు చల్లుతున్నాయి. సరియైన వసతులు అందించకుండానే విద్యార్థుల నుంచి రూ.వేలల్లో ఫీజులు దండుకుంటున్నాయి. నారాయణఖేడ్ పట్టణంలో నలంద, వినాయక రెండు ఒకేషనల్ కళాశాలలు ఉండగా వీటిలో ఏ ఒక్క సౌకర్యం కూడా లేకపోవడం గమనార్హం. ఇరుకు గదుల్లో పాఠాలు బోధిస్తున్నారు. ఫైర్​ సేఫ్టీ పాటించకుండానే తరగతులను నిర్వహిస్తున్నారు. సొంత భవనాలు లేకుండానే అడ్డగోలు పత్రాలు సృష్టించి కళాశాలను నిర్వహిస్తున్నట్లు తెలుస్తున్నది. ఎంఎల్టీ, డీఎల్ఏoటి కోర్సులు కాలేజీలో ఉన్నాయని చెబుతూ స్థానికంగా పాఠాలు చెప్పుకుంటూ అటెండెన్స్‌లు మాత్రం జిల్లా కేంద్రంలో వేయిస్తున్నారు. పరీక్షల సమయంలో విద్యార్థుల వద్ద అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా సరియైన ప్రయోగశాలలు కూడా లేవు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.

దిశ, నారాయణఖేడ్ : పిల్లి గుడ్డిదైతే ఎలుక వెక్కిరించిన సామెత తలపిస్తుంది. సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్ పట్టణంలో ఒకేషనల్ కాలేజీల పేరుతో నిబంధనలను తుంగలో తొక్కుతూ యజమానాలు వివరిస్తున్న తీరు కళ్లకు కోట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. అనుమతుల పేరుతో అడ్డగోలు పత్రాలు సృష్టించి కాలేజీలో నడిపిస్తున్నట్లు తేటతెల్లమవుతున్నది. వడ్డించేవాడు మనవాడైతే ఏ మూలన ఉన్న విందుపక్క అనే చందంగా వ్యవహరిస్తూ అధికారులకు మామూలు ముట్ట చెబుతూ కాలేజీలను నడుపుతున్నారంటే ఎంతటి అవినీతి జరుగుతుందో తెలుస్తుంది. లక్షలు ఖర్చుపెట్టి కోట్లు కొల్లగొట్టాలని ఆలోచనతో విద్యార్థుల నుంచి ఫీజుల పేరుతో ముక్కు పిండి వసూలు చేస్తున్నారు తప్ప వారికి సరైన సదుపాయాలు కల్పించడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

నారాయణఖేడ్‌లో ఒకేషనల్ కాలేజీలో కనీస సదుపాయాలు కరువు

ఒకేషనల్ కాలేజీ ఏర్పాటు చేయాలంటే నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలి. కాలేజీ ఏర్పాటు చేసేందుకు సొంత భవనం కలిగి ఉండాలి. లేకపోతే అద్దెకు తీసుకున్న భవనం ఇన్ని సంవత్సరాల పాటు అగ్రిమెంట్ చేసుకుని ఉండాలి. కానీ ఇరుకు గదుల్లో కాలేజ్ ఏర్పాటు చేసి ప్రయోగశాలలు లేకుండా ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకుండా రూములను అద్దెకు తీసుకొని కాలేజీల పేరుతో విద్యార్థుల నుంచి వేల రూపాయలు వసూలు చేస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం చూసిచూడనట్లు వ్యవహరించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నారాయణఖేడ్ పట్టణంలో నలంద, వినాయక రెండు ఒకేషనల్ కాలేజీలు ఉన్నాయి. ఒకేషనల్ కాలేజీల పేరుతో కొన్ని సంవత్సరాలుగా గడుస్తున్నప్పటికీ అధికారులు వీటిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. కాలేజీల పేరుతో విద్యార్థులకు సేవలు అందిస్తున్నామని యజమానులు ప్రగల్భాలు పలుకుతూ సొసైటీలో గొప్ప వ్యక్తులుగా చలామణి అవుతూ పబ్బం గడుపుతున్నారు తప్ప వీటి వెనుక అవినీతి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని పాపాన్ని ముట్టగట్టుకుంటున్నారన్న విషయం మర్చిపోతున్నారు.

ఒకేషనల్ కాలేజీలకు వారే బాస్ అంటా..?

మాకు ఎవరు ఏం చేయలేరు అంటూ అనే ధీమాతో ఒకేషనల్ కాలేజీలు నడుపుతున్నారు. కాలేజీలు ఏర్పాటు చేసి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. ఎంఎల్టీ, డీఎల్ఏoటి కోర్సులు కాలేజీలో ఉన్నాయని చెబుతూ స్థానికంగా పాఠాలు చెప్పుకుంటూ అటెండెన్స్ లు మాత్రం జిల్లా కేంద్రంలో వేయిస్తూ పరీక్షల సమయంలో విద్యార్థుల వద్ద అధిక ఫీజులు వసూలు చేసి అనుమతులు లేకుండానే కాలేజీలను నడిపిస్తున్నారని వారిపై ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. సంబంధిత అధికారులు సైతం వారికి చూసిచూడనట్లు వివరిస్తున్నారని అనుమతులు ఇస్తున్నారని పలువురు చర్చించుకుంటున్నారు.

ఒకేషనల్ కాలేజీలో కనీస నియమాలను పాటించకుండా ఈ తరహా దoదా చేస్తున్నారని కాలేజీలపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. వినాయక ఒకేషనల్ కాలేజీని దిశ సందర్శించగా 10 గంటల నుంచి 1:00 పరీక్ష విద్యార్థులు రాయాల్సి ఉండగా ఉండగా 11:00 పైనే విద్యార్థులు రావడం గమనార్హం. శనివారం నైతిక మానవ విలువలు, సోమవారం పరిసరాల విజ్ఞానం పరీక్షలు విద్యార్థులు రాశారు. మార్కుల కోసం కాపీ కొట్టిస్తున్నారు. ప్రిన్సిపాల్ ను అడగగా స్పందించకుండా వెళ్లిపోయారు.



Next Story

Most Viewed