నర్లంగి గడ్డలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరణ

by Disha Web Desk 12 |
నర్లంగి గడ్డలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరణ
X

దిశ, దుబ్బాక: దుబ్బాక మండల పరిధిలోని నర్లెంగడ్డ గ్రామంలో రాష్ట్ర మంత్రి శ్రీ హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తో కలిసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. తదనంతరం ముదిరాజ్ సంఘం భవన నిర్మాణం కొరకు, మహిళల సంఘం భవన నిర్మాణానికి ఒక్కొక్క భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో యాసంగిలో పంటలు పండించాలంటే కళ్లలో నీళ్లు వచ్చేవి. కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత తెలంగాణ లో రైతుల కాళ్ల దగ్గరికే నీళ్లు వచ్చాయి అన్నారు.

సీఎం కేసీఆర్ హయాంలో విత్తనం వేయక ముందే రైతుబంధు వచ్చి మీ బ్యాంకు ఖాతాలో పడుతున్నదని చెప్పుకొచ్చారు. నరేండ్లగడ్డ గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా సంతోషకరమైన విషయమని తెలిపారు. తెలంగాణ తల్లి దయతో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం తెచ్చారని, ఉమ్మడి రాష్ట్రంలో బోర్లు వేస్తే చుక్కనీరు రాని పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ స్వరాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మీ గ్రామ కాల్వలు, వాగులు మండుటెండల్లో నిండి పారుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. రోజుకు 30 కోట్లు వెచ్చించి నెలకు వెయ్యి కోట్లు ఖర్చుపెట్టి విద్యుత్ కొనుగోలు చేసి రైతులకు నిరంతరం కరెంటు అందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

నరేండ్లగడ్డ గ్రామంలో మహిళా భవనానికి రూ.10 లక్షలు, ముదిరాజ్ భవనానికి రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు, ఉగాది పండుగ తర్వాత ఇళ్లు మంజూరు చేయిస్తానని మంత్రి హామీనిచ్చారు.ఉమ్మడి రాష్ట్రంలో నాడు కంట తడి ఉంటే.. నేడు స్వరాష్ట్రంలో పంటతడి ఉన్నది. మీ పొలం వాకిట్లోకి నీళ్లు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దేనని రాష్ట్ర మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, జెడ్పిటిసి కడతల రవీందర్ రెడ్డి, ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ గన్నె వనిత భూమి రెడ్డి, పిఎసియస్ చైర్మన్ చింతల జ్యోతి కృష్ణ,మిరుదోడ్డి ఎంపీపీ గజ్జెల సాయిలు, మాజీ పిఎసియస్ చైర్మన్ చైర్ల కైలాసం, నర్లంగి గడ్డ ఎంపీటీసీ కోమటిరెడ్డి మమతా రాజిరెడ్డి, పద్మశాలి గడ్డ పాలకవర్గం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.



Next Story

Most Viewed