చైన్ స్నాచర్‌ అరెస్ట్.. రిమాండ్

by Bhanu |

చైన్ స్నాచింగ్ కేసులో నిందితుడిని కొమురవెల్లి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.

చైన్ స్నాచర్‌ అరెస్ట్.. రిమాండ్
X

దిశ, కొమురవెల్లి: చైన్ స్నాచింగ్ కేసులో నిందితుడిని కొమురవెల్లి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. చోరీ జరిగిన నుంచి అనుక్షణం,ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టి, నిందితుడిని పట్టుకున్నారు. నవంబర్ 29న ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కొమురవెల్లి పోలీసులు స్టేషన్లో కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు. నమ్మకమైన సమాచారం ఆధారంగా పోలీసులు నిందితుడు తిగుళ్ల రాజనీకాంత్‌ను అరెస్టు చేశారు. విచారణలో నిందితుడు నేరాన్ని ఒప్పుకోగా, అతని వద్ద నుండి దొంగిలించిన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని మంగళవారం న్యాయస్థానంలో హాజరు పరచగా, నిందితుడిని జ్యూడిషియల్ రిమాండ్‌‌కు తరలించినట్లు కొమురవెల్లి ఎస్ఐ టి. మహేష్ ప్రకటనలో తెలిపారు.

Next Story