చెట్టు నరికినందుకు షాప్ యజమానికి రూ.10 వేలు ఫైన్

by Web Desk |
చెట్టు నరికినందుకు షాప్ యజమానికి రూ.10 వేలు ఫైన్
X

దిశ, సిద్దిపేట: మొక్కల సంరక్షణ సామాజిక బాధ్యత గా ప్రతి ఒక్కరు భావించాలని సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలను ధ్వంసం చేసిన ప్రదేశాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ ప్రధాన ధ్యేయంగా మొక్కల పెంపకం చేపట్టడం జరుగుతుందని దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్షల మేరకు మొక్కల సంరక్షణ కొనసాగుతుందని వాటిని కావాలని ధ్వంసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

లక్షలాది రూపాయల ప్రజా ధనం తో మొక్కల పెంపకం జరుగుతుందని వాటిని ధ్వంసం చేస్తే ప్రజాధనం వృధా అవుతుందని పేర్కొన్నారు. కాగా రెండు షాపుల ముందు చెట్లను ధ్వంసం చేసిన యజమానులకు పదివేల రూపాయల చొప్పున జరిమానా విధించడంతో పాటు దీనికి బదులుగా వారి పొలాల వద్ద 20 చెట్లను నాటి రక్షించాలని వారికి సూచించారు. వారి పొలాల వద్ద నాటిన మొక్కలను త్వరలో వచ్చి పరిశీలిస్తానని యజమానులకు చెప్పారు. ఈ కార్యక్రమంలో హరితహారం అధికారి సామల అయిలయ్య, మున్సిపాలిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed