- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గంజాయి ముఠా అరెస్ట్
అక్రమంగా ఎండు గంజాయిని తరలిస్తున్న ముఠా సభ్యులను సంగారెడ్డి ఎక్సైజ్ శాఖ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు.

దిశ, సంగారెడ్డి: అక్రమంగా ఎండు గంజాయిని తరలిస్తున్న ముఠా సభ్యులను సంగారెడ్డి ఎక్సైజ్ శాఖ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. మంగళవారం మల్కాపూర్‌లోని వెంకటేశ్వర గార్డెన్ వద్ద ఎక్సైజ్ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఇందులో బీరంగూడకు చెందిన అరుణ్ నాయక్, బీహెచ్ఎల్‌కు చెందిన సాయి ప్రణయ్ నాయక్, సూర్యాపేటకు చెందిన జర్పుల విజయేందర్‌లు గంజాయి తరలిస్తూ పట్టుపడ్డారు. అలాగే ఇస్నాపూర్ వద్ద నీలమారి మేకప్ అనే వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రూ. 50 వేల విలువచేసే 1.75 కేజీల ఎండు గంజాయితో పాటు ఒక స్కార్పియో వాహనం, మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్ ఇంటెండెంట్ శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్లు చంద్రశేఖర్, గాంధీ నాయక్, అనిల్ కుమార్, వీరారెడ్డి, యాదయ్య, కానిస్టేబుళ్లు మాణిక్ ప్రభు, అలీమ్, అనిల్, గోపాల్, సతీష్, రామారావు, కరీం, వివేక్, కావ్యశ్రీలు పాల్గొన్నారు.
- Tags
- medak






