కార్యాలయాలు కార్యకర్తల ఆత్మలు: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే.పీ.నడ్డా

by Disha Web Desk 1 |
కార్యాలయాలు కార్యకర్తల ఆత్మలు: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే.పీ.నడ్డా
X

దిశ, సంగారెడ్డి: బీజేపీ కార్యాలయాలు కార్యకర్తల ఆత్మలని వారిని తీర్చిదిద్దే సంస్కార్ కేంద్రాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రమైన సంగారెడ్డితో పాటు మరో ఐదు జిల్లాల్లో, ఆంద్రప్రదేశ్ లోని రెండు జిల్లాల్లో బీజేపీ జిల్లా కార్యాలయాలను జేపీ నడ్డా ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల అధ్యక్షులు బండి సంజయ్, సోమ్ వీర్రాజ్ లను అభినందించారు. బీజేపీ పార్టీ కార్యాలయాలు కార్యకర్తల ఆత్మలని, వారిని తీర్చిదిద్దేందుకు ఏర్పాటు చేసిన సంస్కార్ కేంద్రాలన్నారు.

బీజేపీ పార్టీకి దేశ వ్యాప్తంగా 18 కోట్ల సభ్యత్వం ఉందన్నారు. అవి కాంక్రీట్ బిల్డింగ్ లు కావని సప్నోంకా విస్తార్ అన్నారు. బీజేపీ ప్రస్థానం రెండు ఎంపీ స్థానాలతో ప్రారంభమై ప్రస్తుతం 303 ఎంపీలు ఉన్నారని ఆనందం వ్యక్తం చేశారు. 1989లో రాంమందిరం నిర్మించాలని దేశ వ్యాప్తంగా రథయాత్ర నిర్వహించి 2020వ సంవత్సరంలో బీజేపీ ప్రభుత్వం రామ మందిరం నిర్మాణం ప్రారంభించిని తెలిపారు. దేశంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత దేశ జీడీపీ ప్రపంచంలోనే 5వ స్థానానికి చేరుకుందన్నారు.

దేశ వ్యాప్తంగా హైవేల నిర్మాణాలు నాలుగింతలు పెరిగాయని, అత్యధికంగా ఎయిర్ పోర్టులు నిర్మాణం చేసుకున్నామని తెలిపారు. అదే విధంగా పేదలకు ప్రధాని ఉజ్వల్ పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందించామని, కరోనా సమయంలో ప్రజలకు దేశ వ్యాప్తంగా ఉచిత బియ్యం, గోధుమలను అందించి ఆదుకున్నామని అన్నారు. ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ప్రధాన నరేంద్ర మోదీ సారథ్యంలో దేశం దూసుకుపోతుందన్నారు. బీజేపీ ప్రభుత్వం మాస్ పాలోయింగ్ తో అధికారంలోకి వచ్చిందన్నారు. ఇంత పెద్ద ఎత్తున ఆదరణ ఏ పార్టీకి లేదన్నారు.

ఉత్తర భారతదేశంలో పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నామని తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధిదకారంలోకి వచ్చేలా అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి నుంచి తెలంగాణ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్ చార్జి తరుణ్ చుగ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, సునీల్ వన్సల్, జాతీయ కార్యదర్శి అరవింద్ మిలన్, రాష్ట్ర నాయకులు మురళీధర్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, కొండాపురం జగన్, నెమలికొండ వేనుమాదవ్, చంద్రశేఖర్, విష్ణువర్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, బాబుమోహన్, నియోజకవర్గ ఇన్ చార్జి రాజేశ్వర్ రావు దేశ్ పాండే, తదితరులు పాల్గొన్నారు.



Next Story