మహాత్మా జ్యోతి బాపూలే జీవితం ఆదర్శప్రాయం: మంత్రి హరీశ్ రావు

by Disha Web Desk 1 |
మహాత్మా జ్యోతి బాపూలే జీవితం ఆదర్శప్రాయం: మంత్రి హరీశ్ రావు
X

దిశ, సంగారెడ్డి: మహాత్మా జ్యోతి బాపూలే జీవితం ఆదర్శనీయమని, వారి ఆదర్శాలు, ఆశయాలకు అనుగుణంగా నేటి యువత నడుచుకోవాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు అన్నారు. మహాత్మా జ్యోతిబాపూలే 197వ జయంతిని పురస్కరించుకొని మంగళవారం సంగారెడ్డి పట్టణం రోడ్లు మరియు భవనాలు శాఖ కార్యాలయము వద్ద గల జ్యోతి బాపూలే విగ్రహానికి మంత్రి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమములో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మంజు శ్రీ జైపాల్ రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, రాష్ట్ర చేనేత మరియు జాళి శాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ చింత ప్రభాకర్, జిల్లా కలెక్టర్ ఏ. శరత్, అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ బొంగుల విజయలక్ష్మి, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు జ్యోతి బాపూలే భవనానికి కంది మండలం, కాశీపూర్ లో కేటాయించిన ఒక ఎకరం స్థలానికి సంబంధించిన పత్రాలను బీరయ్య యాదవ్ కు అందించారు.

అనంతరం వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యములో నటరాజ్ థియెటర్ ప్రక్కన కల్వకుంట రహదారిలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చింత ప్రభాకర్ మాట్లడుతూ సమాజంలో ఉన్న కుల, వర్గ, వర్ణ వివక్షతల నిర్మూలనకు చదువు ఒక్కటే సరైన మార్గమన్నారు. వారు సమాజాభివృద్ధి కోసం జ్యోతి బాపూలే చేసిన సేవలను కొనియాడారు. పూలే భవన నిర్మాణానికి కావలసిన నిధులు రూ.కోటి ప్రభుత్వం అందించేందకు మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారని తెలిపారు. అదనపు కలెక్టర్ వీరారెడ్డి మాట్లాడుతూ చరిత్రను తిరగ రాసిన వ్యక్తి పూలే అని, మహిళల విద్య కోసం, సమాజంలోని దురాచారాల నిర్మూలనకు కృషి చేసిన మహోన్నతుడని ఆయన పేర్కొన్నారు.

కార్యక్రమములో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి జగదీష్, వివిధ శాఖల జిల్లా అధికారులు, రెవిన్యూ డివిజనల్ అధికారి నగేష్, డీసీసీబీ వైస్ చైర్మన్ మాణిక్యం, సునీత మనోహర్, కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్, రిటైర్డ్ ప్రిన్సిపాల్ రాములు, కేవీపీఎస్ అధ్యక్షుడు మాణిక్యం, యువజన సంఘాల అధ్యక్షులు కూన వేణుగోపాల్, శ్రీహరి, వరలక్ష్మి, పోలీస్ రామచంద్రం, వివిధ కుల సంఘాల నాయకులు, వెనుకబడిన తరగతుల సహాయ అభివృద్ధి అధికారి భాగ్యలక్ష్మి, జిల్లా వసతి గృహ సంక్షేమ అధికారుల సంఘం అధ్యక్షులు మొహమ్మద్ గౌస్, విద్యార్థులు, ప్రజలు, పాల్గొన్నారు.



Next Story

Most Viewed