అక్టోబర్ 15న హుస్నాబాద్ కు రానున్న కేసీఆర్

by Disha Web Desk 22 |
అక్టోబర్ 15న హుస్నాబాద్ కు రానున్న కేసీఆర్
X

దిశ, హుస్నాబాద్: విజయానికి నాంది, హైదరాబాదుకు ఈశాన్యంలో ఉన్న హుస్నాబాద్ లక్ష్మి నియోజకవర్గం. అందువల్లే సీఎం కేసీఆర్ మొట్టమొదటి ఎన్నికల ప్రచార సభ హుస్నాబాద్ లో నిర్వహించాలని సీఎం నిర్ణయించారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. ఈనెల 15న హుస్నాబాద్‌కు సీఎం కేసీఆర్ రానున్న నేపథ్యంలో మంగళవారం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ లతో కలిసి స్థలాలు పరిశీలించారు. చివరగా కరీంనగర్ రోడ్డులో ఉన్న సబ్ స్టేషన్ పక్కన గల మైదానాన్ని సీఎం సభకు అణువు వుగా ఉందని గుర్తించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ... 2019 అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు సీఎం కేసీఆర్ హుస్నాబాద్ లోని ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించి విజయం సాధించారని అదేవిధంగా జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్లో మళ్లీ హుస్నాబాద్ ను లోనే సభ నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందని అన్నారు. సెంటిమెంట్‌కు చిరునామా విజయానికి నాంది అయిన హుస్నాబాద్ లో లక్ష మందికి పైగా జన సమీకరణ చేసి విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

అభివృద్ధిని ఓర్వలేని ప్రతిపక్షాలు అవాకులు చివాకులు పేలుతున్నాయని హరీష్ రావు విమర్శించారు. టికెట్లు ఇచ్చుకునే స్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదని ఢిల్లీలో ఎక్కువ గల్లీలో తక్కువ ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో హుస్నాబాద్ నియోజకవర్గానికి అభివృద్ధి ఏమి చేసింది లేదని ముఠా రాజకీయాలకు పెట్టింది పేరు కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తొమ్మిదిన్నర సంవత్సరాలలో కరువు లేదు కర్ఫ్యూ లేదని అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం గౌరవెల్లి ప్రాజెక్టు సీఎం కేసీఆర్ ఇచ్చిన గొప్ప వరమని సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తిలో భారతదేశంలోనే అత్యధికంగా పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ఇలాంటి అభివృద్ధిని చూడలేని కాంగ్రెస్ బిజెపి లకు రానున్న రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు.

Next Story

Most Viewed