సింగూరు ప్రాజెక్టుకు పెరిగిన వరద ఉధృతి

by Disha Web Desk 13 |
సింగూరు ప్రాజెక్టుకు పెరిగిన వరద ఉధృతి
X

దిశ, చౌటకూర్: సింగూరు ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరిగింది. ఎగువన కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భారీగా వరద నీరు వస్తుంది. బుధవారం రాత్రి 10:15 గంటల ప్రాంతంలో 15,5 వ నెంబర్ గేటును సుమారు మీటరున్నర ఎత్తి 10858 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. 8862 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతున్నది. ప్రాజెక్టు సామర్థ్యం 29,917 టీఎంసీలు.ఒక జల విద్యుత్ గేటు 2647 క్యూసెక్కులు, క్రెస్ట్ గేట్స్ 8211 క్యూసెక్కులు, కాగా గేట్లు ఎత్తడంతో మంజీర పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ శాఖ అధికారులు హెచ్చరించారు.ముఖ్యంగా మత్స్యకారులు,గొర్రెలు, పశువుల కాపరులు మంజీర తీరం వైపు వెళ్లవద్దని సూచించారు.


Next Story

Most Viewed