సెల్ టవర్ ఎక్కి యువ జంట హల్‌చల్

by Bhanu |

సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యువ జంట సెల్ టవర్ ఎక్కి హల్‌చల్ చేశారు

సెల్ టవర్ ఎక్కి యువ జంట హల్‌చల్
X

దిశ, నంగునూరు: సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యువ జంట సెల్ టవర్ ఎక్కి హల్‌చల్ చేశారు. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ శ్రీనివాస్, రాజగోపాల్ పేట ఎస్సై వివేక్ ఘటన స్థలానికి చేరుకున్నారు. తమ కుటుంబ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్సై వివేక్‌తో బాధితులు డిమాండ్ చేశారు. వారికి ఎస్సై వివేక్ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో సెల్ టవర్ దిగారు. ఈ సందర్భంగా ఎస్సై వివేక్ మాట్లాడుతూ.. కోల వరలక్ష్మీ శ్రీకాంత్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇరు కుటుంబాల వారిని ఇంటిలోకి రానివ్వడం లేదు. దీనికి తోడు ఆస్తీ సైతం ఇవ్వడం లేదు. ఈ సమస్య పై పోలీస్ స్టేషన్‌లో కేసు పెండింగ్‌లో ఉందన్నారు. సుమారు గంటన్నర పాటు సెల్ టవర్ ఎక్కిన నిరసన తెలిపిన కోల వరలక్ష్మీ శ్రీకాంత్ పోలీసుల జోక్యంతో కిందికి దిగడంతో అందరూ ఊపిరి పిల్చుకున్నారు.

Next Story