ఈనెల 20న మెదక్ కు సీఎం రాక

by Disha Web Desk 15 |
ఈనెల 20న మెదక్ కు సీఎం రాక
X

దిశ , సంగారెడ్డి బ్యూరో : ఈనెల 20వ తేదీన మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ సందర్భంగా మెదక్ పట్టణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నారని దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ తెలిపారు. శామీర్ పేటలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే, జగ్గారెడ్డి, మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్,డీసీసీ ప్రెసిడెంట్లు, నియోజకవర్గ ఇన్చార్జిలు, మండల, బ్లాక్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులతో మంత్రి కొండా సురేఖ భేటీ అయ్యారు. మెదక్, సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, నర్సాపూర్, పటాన్ చెరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిలు,డీసీసీ ప్రెసిడెంట్లతో కలిసి మంత్రి కొండా సురేఖ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా నామినేషన్ కార్యక్రమానికి ఎలా ముందుకెళ్లాలి అన్న అంశాలపై చర్చించి నేతలు, పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేశారు.

అలాగే పబ్లిక్ ను తరలించడంతోపాటు ఏర్పాట్ల గురించి కూడా పలు సూచనలు చేశారు. అలాగే ప్రచార పర్వానికి సంబంధించిన వ్యూహాలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ మెదక్ పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా నీలం మధు ముదిరాజ్ నామినేషన్ వేస్తున్నారని తెలిపారు. నీలం మధు తరపున నామినేషన్ వేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి మెదక్ కలెక్టరేట్ కు సీఎం రేవంత్ వస్తున్నట్లు పేర్కొన్నారు. నామినేషన్ సందర్భంగా మెదక్ రాంపూర్ చౌరస్తా నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టు చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ కు ముందే వీటన్నింటినీ పూర్తి చేయాలని సూచించారు. ఎంపీ అభ్యర్థి నీలం మధు నామినేషన్ దాఖలు కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని పార్టీ నేతలు, నాయకులకు మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు.

Next Story