- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బస్సు బైకు ఢీ.. ఒకరు మృతి
దిశ, కొండపాక : ఆర్టీసీ బస్సు-బైకు ఢీ కొని ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి మడంల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన ప్రకారం.. కుకునూర్ పల్లి మండల

దిశ, కొండపాక : ఆర్టీసీ బస్సు-బైకు ఢీ కొని ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి మడంల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన ప్రకారం.. కుకునూర్ పల్లి మండల కేంద్రానికి చెందిన న్యాలపోగుల నాగరాజు (30 ) బైక్ పై రోడ్డు దాటుతుండగా.. సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ కు వెళ్తున్న సిద్దిపేట డిపో ఆర్టీసి బస్సు బైక్ ను ఢీకోట్టడంతో బైక్ పైన ఉన్న న్యాలపోగుల నాగరాజు తలకు తీవ్ర గాయలు కాగ 108 అంబులెన్స్ లో గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించగా.. నాగరాజు చెక్ చేసిన వైద్యులు అప్పటికి మృతి చెందాడు అని తెలిపారు. కుటుంబ సభ్యులు పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దార్యాప్తు చేస్తున్న మని పోలీసులు తెలిపారు. మృతునికి భార్య, ఓ పాప, ఓ బాబు ఉన్నారు. అందరితో కలివిడిగా ఉండే నాగరాజ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుకునూర్ పల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.






