బూస్టర్ డోస్ సిద్ధం: జిల్లా కలెక్టర్ శరత్

by Disha Web Desk 1 |
బూస్టర్ డోస్ సిద్ధం: జిల్లా కలెక్టర్ శరత్
X

దిశ, సంగారెడ్డి: కరోనా వ్యాధి నియంత్రణలో భాగంగా జిల్లాలో 18 ఏళ్లు పైబడి వారు రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకుని, బూస్టర్ డోసు తీసుకోని వారందరికీ ఈనెల 24 నుంచి బూస్టర్ డోస్ (కార్బియక్స్ వ్యాక్సిన్) ఇవ్వనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ తెలిపారు. జిల్లాలో నాలుగు కేంద్రాల్లో బూస్టర్ డోస్ పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన వెల్లడించారు. జహీరాబాద్ లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్, సంగారెడ్డి మార్క్స్ నగర్ లోని యూపీహెచ్ సీ, పటాన్ చెరు, నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రుల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 3 వరకు బూస్టర్ డోస్ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.

గతంలో రెండు డోసులు తీసుకుని బూస్టర్ డోసు తీసుకోని వారందరూ బూస్టర్ డోసుకు అర్హులని కలెక్టర్ తెలిపారు. కోవ్యాక్సిన్, కోవి షీల్డ్ తీసుకున్న వారు కూడా బూస్టర్ డోస్ గా కార్బియక్స్ వ్యాక్సిన్ ను తీసుకోవచ్చని తెలిపారు. జిల్లాలో బూస్టర్ డోసు తీసుకోని వారందరూ విధిగా బూస్టర్ డోస్ తీసుకుని కరోనా వ్యాప్తి నివారించడానికి సహకరించాలని పిలుపునిచ్చారు.

Next Story

Most Viewed