- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
UPSC Topper Dance Video: డాన్స్ చేసిన సివిల్స్ సెకండ్ ర్యాంకర్.. వీడియో వైరల్
దిశ వెబ్ డెస్క్: ఇటీవల UPSC మెయిన్స్ తుది ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. కాగా ఈ ఫలితాల్లో ఒడిశాకు చెందిన అనిమేష్ ప్రధాన్ అనే వ్యక్తి UPSC రెండవ ర్యాంక్ హోల్డర్‌గా నిలిచారు. ఇంటర్ చదువుతున్నప్పుడే తన తండ్రిని కోల్పోయారు. అలానే UPSC చివరి ఇంటర్వ్యూ రౌండ్‌కు కేవలం ఒక నెల ముందు క్యాన్సర్‌తో అతని తల్లి కూడ మరణించారు.
తల్లిదండ్రులను కోల్పోయిన తాను ఎలాంటి కోచింగ్ లేకుండానే యుపిఎస్సి కి ప్రిపేర్ అయ్యాడు. మొదటిసారి ప్రయత్నంలోనే ఆల్ ఇండియా రెండవ టాపర్‌గా నిలిచారు. ఆటుపోట్లను అధిగమించి, బాధలను దిగమింగి, తను అనుకున్న లక్ష్యాన్ని చేరేందుకు అనిమేష్ ఎంతో కష్టపడ్డారు. ఎలాంటి కోచింగ్ లేకుండానే అంకిత భావంతో ఉపస్సీకి ప్రిపేర్ అయ్యారు.
UPSCలో ఉత్తీర్ణత సాధించేందుకు తాను ప్రతిరోజు 6 నుండి 7:00 చదువుకునేవాడిని అని ఆయనే తెలిపారు. చివరికి ఆయన అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. దీనితో అనిమేష్ ప్రధాన్ చేసిన డాన్స్ వీడియోని ప్రస్తుతం కొంతమంది వైరల్ చేస్తున్నారు. అది చూసిన అనిమేష్ తన ఎక్స్ అకౌంట్‌లో ఆ వీడియోని రీపోస్ట్ చేశారు. కొందరు నా డాన్స్ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు, కొంత ఆనందాన్ని పొందండి అనే ట్యాగ్ లైన్ ఆ వీడియోకి జోడిచారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఆ వీడియోని మీరు ఒకసారి చూసేయండి.