అటవీ పరిధిలో లేని వాటిని డిజిటల్ సైన్ కోసం చర్యలు : కలెక్టర్

by Disha Web Desk 13 |
అటవీ పరిధిలో లేని వాటిని డిజిటల్ సైన్ కోసం చర్యలు : కలెక్టర్
X

దిశ, మెదక్ ప్రతినిధి: లబ్ధిదారులకు ఇచ్చిన అసైన్డ్ భూమి.. అటవీ శాఖ పరిధిలోకి రాకుండా ఉన్నవి ధరణి రికార్డులో నమోదయి డిజిటల్ సైన్ పెండింగ్ లో గల వాటిని, డిజిటల్ సైన్ చేయుటకు తగు చర్యలు తీసుకోవలసిందిగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో అటవీ, రెవిన్యూ శాఖల మధ్య వివాదంలో ఉన్న భూముల పరిష్కారం పై మెదక్ శాసన సభ్యురాలు పద్మాదేవేందర్ రెడ్డి, అదనపు కలెక్టర్ రమేష్ తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చిన్న శంకరంపేట్ మండలంలోని సూరారం, ఎస్. కొండాపూర్, టి. మాందాపూర్, గజగట్లపల్లి లోని వివిధ సర్వే నెంబర్లలో అందజేసిన అసైన్డ్ పట్టా భూములు, రెవెన్యూ రికార్డులతో సరిచూసి డిజిటల్ సైన్ కొరకు చర్యలు తీసుకోవలసిందిగా సూచించారు.

అనంతరం 2021-22 ఖరీఫ్ కు సంబంధించి సి.ఎం.ఆర్. రైస్ పై సమీక్షిస్తూ పెండింగ్ లో ఉన్న 13,700 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ చేసి ఎఫ్.సి.ఐ.కి తరలించి వలసినదిగా మిల్లర్లకు సూచించారు. ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు గడవు పొడగించినందున ఈ వారం రోజుల్లో పెండింగులో ఉన్న ధాన్యాన్ని మిల్లింగ్ చేసి భారత ఆహార సంస్థ కు పంపవలసినదిగా సూచించారు. ఇటీవల హైద్రాబాద్‌లో అదనపు కలెక్టర్లు, పౌర సరఫరాల అధికారులతో జరిగిన సమావేశంలో సి.ఎం.ఆర్. పెండింగ్ ఉన్న మిల్లర్లకు ఎట్టి పరిస్థితుల్లో 2022-23 రబీకి సంబంధించి ధాన్యం కేటాయించరాదని నిర్ణయం తీసుకున్నారని, కాబట్టి మిల్లర్లు ఎవ్వరు కూడా డిఫాల్ట్ కాకుండా పెండింగ్ సి.ఎం.ఆర్. అందించుటకు కృషి చేయాలని అన్నారు.

అదేవిధంగా కార్పొరేషన్ తిరస్కరించిన బియ్యాన్ని ఆయా మిల్లర్లు 48 గంటలలో తీసుకెళ్లాలని, రాష్ట్ర, కేంద్ర గిడ్డంగులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ లో హమాలీల సంఖ్య పెంచాలని, నూతన గొనె సంచులు అందించుటకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అటవీ అధికారి రవి ప్రసాద్, ఆర్.డి.ఓ. సాయి రామ్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకులు శశి కుమార్, డి.ఎస్.ఓ. శ్రీనివాస్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు చంద్ర పాల్, తహసీల్దార్లు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి : రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లకు కేటీఆర్ లీగల్ నోటీసులు!

Next Story

Most Viewed