- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బంగారు వర్ణంతో ఉన్న చేప లభ్యం
by Kema Shiva Kumar |
మత్స్యకారులకు బంగారు వర్ణంలో ఉన్న చేప దొరికిన ఘటన కంగ్టి మండల పరిధిలోని తడకల్ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.

X
దిశ, నారాయణఖేడ్: మత్స్యకారులకు బంగారు వర్ణంలో ఉన్న చేప దొరికిన ఘటన కంగ్టి మండల పరిధిలోని తడకల్ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. మత్స్యకారులు తెలిపిన ప్రకారం తడకల్ గ్రామంలోని పెద్ద చెరువులో వారం రోజుల నుంచి 15 మంది మత్స్యకారులు చేపలు పడుతున్నారు. ప్రతిరోజూ మాదిరిగానే వల వేయగా బంగారం వర్ణం చేప చిక్కింది. చేప బరువు సుమారు ఐదు కిలోలపైనే ఉందని తడకల్ మత్స్యకారులు తెలిపారు. ఇలాంటి చేప దొరకడం ఇదే మొదటిసారి కావడంతో చుట్టుపక్కల వారు చేపను చూసేందుకు భారీగా తరలివచ్చారు. అనంతరం చేపను హైదరాబాద్ లోని ముషిరాబాద్ మార్కెట్ కు తరలించారు.
Next Story






