తెలంగాణ లిక్కర్ డిపోల్లో భారీ బదిలీలు.. 66 మంది ఉద్యోగులకు స్థానచలనం

by Ramesh Naini |

తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ బదిలీలు జరిగాయి. సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 19 లిక్కర్ డిపోల్లో పనిచేస్తున్న మొత్తం 66 మంది ఉద్యోగులకు స్థానచలనం కల్పిస్తూ ఎక్సైజ్ శాఖ కమిషనర్, బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ సి.హరికిరణ్ ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణ లిక్కర్ డిపోల్లో భారీ బదిలీలు.. 66 మంది ఉద్యోగులకు స్థానచలనం
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ బదిలీలు జరిగాయి. సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 19 లిక్కర్ డిపోల్లో పనిచేస్తున్న మొత్తం 66 మంది ఉద్యోగులకు స్థానచలనం కల్పిస్తూ ఎక్సైజ్ శాఖ కమిషనర్, బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ సి.హరికిరణ్ ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఆదేశాల మేరకు సంస్థ జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు బుధవారం బదిలీల ఉత్తర్వులు వెలువరించారు. విభాగాల వారీగా.. బదిలీ అయిన వారిలో అత్యధికంగా అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్లు ఉన్నారు. మొత్తం 66 మందిలో 9 మంది అసిస్టెంట్ మేనేజర్లు, ఒక స్టోర్స్ ఆఫీసర్, 49 మంది అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్లు, ఐదుగురు అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్లు ఉన్నారు. వీరితో పాటు డీపీఏ-2 విభాగంలో పనిచేస్తున్న మరో ఇద్దరు ఉద్యోగులకు సైతం బదిలీ ఆర్డర్లను అందజేశారు.

దివ్యాంగులకు మినహాయింపు..

ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా బదిలీల ప్రక్రియను చేపట్టారు. ఇందులో భాగంగా 70 శాతానికి పైగా అంగవైకల్యం ఉన్న ఇద్దరు అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్లకు బదిలీల నుంచి మినహాయింపు నిచ్చారు. నిబంధనల ప్రకారం వారిని ప్రస్తుతం పనిచేస్తున్న స్థానాల్లోనే కొనసాగిస్తున్నట్లు జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు వెల్లడించారు.

Next Story