- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
GHMC : జీహెచ్ ఎంసీలో భారీగా శానిటేషన్ జవాన్ల బదిలీ
జీహెచ్ఎంసీ(GHMC)లో శానిటేషన్ల జవాన్ల(Sanitation Jawans)ను భారీ సంఖ్యలో బదిలీ(Transferred)చేశారు..

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ(GHMC)లో శానిటేషన్ల జవాన్ల(Sanitation Jawans)ను భారీ సంఖ్యలో బదిలీ(Transferred)చేశారు.. జీహెచ్ఎంసీ పరిధిలో సుదీర్ఘకాలంగా ఒకే చోట పని చేస్తున్న 139 మంది శానిటేషన్ జవాన్లను బదిలీ చేస్తూ కమీషనర్ ఇలంబర్తి(Commissioner Ilambarthi) ఉత్తర్వులు జారీ చేశారు. ఐదేళ్లకు పైగా ఒకే చోట పని చేస్తున్నారని గుర్తించి వారిని కమీషనర్ బదిలీ చేశారు.
జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 259 మంది శానిటేఫన్ జవాన్లు ఉన్నారు. వారిలో ఒకేసారి ఇంత పెద్ధ సంఖ్యలో బదిలీలు నిర్వహించడం విశేషం. జీహెచ్ఎంసీలో చిరు ఉద్యోగుల బదిలీలో కూడా రాజకీయ జోక్యం ఉండే పరిస్థితుల్లో ఒకేసారి 139మంది శానిటేషన్ జవాన్ల బదిలీ చేయడం విశేషం. జీహెచ్ఎంసీ పరిధిలో పర్మినెంట్, కాంట్రాక్టు, ఔట్ సోర్సింది అంతా కలిపి దాదాపు 27 వేల మందికి పైగా ఉంటారని సమాచారం.
శానిటేషన్ విభాగం వారే సింహభాగంగా 19వేల మంది వరకు ఉన్నారు. సూపర్ వైజర్లు, ఆపరేటర్లు, జూనియర్ సినియర్ అసిస్టెంట్లు, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు, జాయింట్ కమిషనర్లు, మెడికల్ ఆఫీసర్లు, డిప్యూటీ కమిషనర్లు సహా వివిధ విభాగాల ఉద్యోగులు, అధికారులలో చాల మంది మూడేళ్లకు పైగా ఒకే చోట పనిచేస్తున్నారు. వారిలో బదిలీలతో ప్రక్షాళన చేయాలన్న డిమాండ్ వినిపిస్తుంది.






