మల్లికార్జున్‌ ఖర్గే అభ్యర్థిత్వాన్ని స్వాగతిస్తున్నాం

by Disha Web Desk 7 |
మల్లికార్జున్‌ ఖర్గే అభ్యర్థిత్వాన్ని స్వాగతిస్తున్నాం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలకు మల్లికార్జున్‌ ఖర్గే అభ్యర్థిత్వాన్ని స్వాగతిస్తున్నట్లు టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు తెలిపారు. శనివారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. సమాజంలో, ప్రభుత్వంలో పార్టీ సంస్థలో మెరుగైన, స్థిరమైన మార్పును తీసుకురావడానికి ఆయన ఎంతో కృషి చేశారని అన్నారు. ఖర్గే 11 సార్లు ఎమ్మెల్యే, ఎంపీగా ఎన్నికయ్యారని చెప్పారు. ఆయనకు ప్రభుత్వ, ప్రజా జీవితంలో అపారమైన అనుభవం కలిగి ఉందని, ఖర్గే రాజ్యాంగం ప్రకారం నిరంతరంగా మార్పు కోసం కృషి చేస్తున్నారన్నారు. ఆయన మార్పు కోసం పనిచేయడం లేదని ఎవరైనా అంటే అది తప్పన్నారు. అందుకే ఆయనకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మద్దతునిస్తూ, విజయాన్ని కోరుకుంటున్నట్లు చెప్పారు.

పేదల పొట్ట కొట్టడానికి పోలీసులు సిద్ధం: వీ హెచ్

ఎస్టీ రిజర్వేషన్ల అమలుకు ఎనిమిది ఏండ్లు ఎందుకు ఆలస్యం చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్రం మీద నెపం పెట్టి కేసీఆర్ గిరిజన రిజర్వేషన్‌లపై కాలయాపన చేశారని, ఎనిమిదేళ్లు గిరిజనులు నష్టపోయారని తెలిపారు. రిజర్వేషన్‌పై కేంద్రానికి సంబంధం లేని అంశాన్ని కేంద్రం పేరు చెప్పి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌కు ఇవాళ జ్ఞానోదయం అయ్యిందన్నారు. గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన హక్కును కాలరాశారని, టీఆర్ఎస్ ఎందుకు సంబరాలు చేసుకుంటుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు మాట్లాడుతూ.. ఫుట్ పాత్‌ల మీద చిరు వ్యాపారస్తులపై పోలీసుల ప్రతాపం చూపిస్తున్నారని, చిన్నోళ్ల మీద చలాన్లు వేస్తా అని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. నగరంలో వర్షం వచ్చిందంటే ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందని, దాని గురించి పోలీసులు పట్టించుకోరని, పేదల పొట్ట కొట్టడానికి మాత్రం సిద్ధంగా ఉంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


Next Story

Most Viewed