సబ్జెక్ట్ లేని రేవంత్ సీఎం అవుతాడా..? మంత్రి మల్లారెడ్డి సెటైర్లు

by Satheesh |
సబ్జెక్ట్ లేని రేవంత్ సీఎం అవుతాడా..? మంత్రి మల్లారెడ్డి సెటైర్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి మరోసారి విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. మల్కాజ్ గిరి ఎంపీగా రేవంత్ రెడ్డిని గెలిపిస్తే గత నాలుగేళ్లుగా నియోజకవర్గం తరపున గాని, తెలంగాణ తరపున గాని పార్లమెంట్‌లో ఏమి మాట్లాడలేకపోయారని విమర్శించారు. రేవంత్ రెడ్డికి సబ్జెక్ట్ లేదని అలాంటి వ్యక్తి ఆర్నెళ్లలో సీఎం అవుతాడా అని ఎద్దేవా చేశారు.

ఢిల్లీకి వెళ్లి పార్లమెంట్‌లో నియోజకవర్గం గురించి ఏమీ మాట్లాడకపోయినా పీసీసీ పదవి మాత్రం తెచ్చుకున్నాడని సెటైర్లు వేశారు. రేవంత్ రెడ్డి సంగతి అంతా ప్రజలకు తెలుసని అన్నారు. మాయమాటలు చెబుతూ కాంగ్రెస్, బీజేపీ నేతలు వస్తారని వారిని ప్రజలు నమ్మవద్దని అన్నారు. రాష్ట్రంలో మరోసారి కేసీఆరే గెలిచి హ్యాట్రిక్ కొడుతారని ధీమా వ్యక్తం చేశారు. పీఎం పదవి కోసం కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నామని భగవంతుడి ఆశీస్సులతో కేంద్రంలోనూ కీలక పాత్ర పోషిస్తామన్నారు.

Next Story

Most Viewed