మీరే నాకు బాకీ మీ ఓటు నాకు వేసి మీ బాకీ తీర్చుకోండి..!

by Disha Web Desk 11 |
మీరే నాకు బాకీ మీ ఓటు నాకు వేసి మీ బాకీ తీర్చుకోండి..!
X

దిశ, మిడ్జిల్ : జడ్చర్ల నియోజకవర్గం లో తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి చేసిన అభివృద్ధి పనులతో పోలిస్తే, నియోజకవర్గ ప్రజలే తనకు బాకీ పడ్డారని ఆ బాకిని రాబోయే ఎన్నికల్లో ఓటు వేసి తీర్చుకోవాలని మంత్రి జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. శనివారం మిడ్జిల్ మండలం కంచనపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాల లో మన ఊరు మనబడి పథకం ద్వారా 26 లక్షల తో చేపట్టిన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రారంభించారు.

అంతకు ముందు గ్రామంలో ఎమ్మెల్యే నిధులతో నిర్మించిన యాదవ సంఘం భవనం, పీర్ల మసీదు నుఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రారంభించారు. గ్రామంలో ఎస్సీ కమిటీ ముదిరాజ్ సంఘం భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.అనంతరం ఏర్పాటుచేసిన సభలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ. తెలంగాణ ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యతస్తుందని, అందులో భాగంగానే సర్కారు బడులను బలోపేతంచేస్తూ, మౌలిక వసతులను కల్పిస్తుందని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ బోర్డులు, బాలికలకు టాయిలెట్స్, అత్యధిక మౌలిక సదుపాయాలతో గ్రామం పాఠశాల కార్పొరేట్ పాఠశాలకు దీటుగా మారిందన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా దళితబంధు, గృహాలక్ష్మి, బి సి కులవృత్తిదారులకు పూర్తి సబ్సిడీ లోన్లు, మైనారిటీ సబ్సిడీ రుణాలు లాంటి పథకాలను రూపొందించి అమలు చేస్తున్నామని అన్నారు. అనేక రకాల పెన్షన్ లను అందిస్తున్నామని ఆన్నారు. రైతులకు 24 గంటల కరెంట్, రైతుబంధు, రైతుభీమ పథకాలతో అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలుస్తోందని అన్నారు.

కంచనపల్లి గ్రామానికి కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేక ప్రజలు నానా అవస్థలు పడేవారని నేడు రోడ్డు తో పాటు గ్రామంలో సకల వసతులు కల్పించామని ఈ గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులతో పోలిస్తే మీరే నాకు బాకీ పడ్డారని ఆ బాకీ ని రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి, నాకు ఓటు వేసి ఆ బాకిని తీర్చుకోవాలని సభ వద్ద ఉన్న గ్రామ ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు.

ఎన్ని పనులు చేసిన పనిచేసే ప్రభుత్వన్నీ గుర్తించాలని వారికి అండగా నిలవాలని ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ బర్గెల సుదర్శన్ జెడ్పీటీసీ శశిరేఖ బాలు స్థానిక సర్పంచ్ అక్బర్ బేగం స్థానిక ఎంపీటీసీ శంకరయ్య పిఎసిఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో సాయి లక్ష్మి, ఎంఈఓ మంజులాదేవి ప్రధానోపాధ్యాయులు ఆర్ నరసింహులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు సుధా బాల్ రెడ్డి, ఎల్లయ్య యాదవ్ మామిడి మాడ భాస్కర్ రఫిక్, మాజీ ఎంపీటీసీ శివప్రసాద్, ఏ ఈ హిరయ్య నాయక్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed