మనం వేసే ఓటే మన పిల్లల భవిష్యత్: ఎస్పీ రంజన్ రతన్ కుమార్

by Disha web |
మనం వేసే ఓటే మన పిల్లల భవిష్యత్: ఎస్పీ రంజన్ రతన్ కుమార్
X

దిశ, గద్వాల క్రైమ్: మన వేసే ఓటు మన పిల్లల భవిష్యత్ ను నిర్ణయిస్తుందని, 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్ అన్నారు. బుధవారం జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ అర్హులైనా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును ఓటరు జాబితాలో నమోదు చేసుకొని ప్రజాస్వామ్యంఫై విశ్వాసంతో కులం, మతం, వర్గం, భాష, ఎటువంటి ఒత్తిడులకు లోనూ కాకుండా నిర్భయంగా ఓటు వేయాలని తెలిపారు.

బ్రిటిష్ కాలంలో కొందరికే ఓటు హక్కు ఉండేదని దేశంలో ప్రజలందరికీ సమాన హక్కులు ఉండాలని బాబా సాహెబ్ అంబేద్కర్ దూర దృష్టితో 18 సంవత్సారాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. ఓటరు హెల్ప్ లైన్ డౌన్ లోడ్ చేసుకొని అర్హులు తమ పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని తెలిపారు. ఓటు ప్రాధాన్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ ఏఓ సతీష్ కుమార్, పోలీసు సిబ్బంది శివ కుమార్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, లోహిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


Next Story