ప్ర‌తి పేద కుటుంబానికి సొంత ఇల్లు క‌ల్పించ‌డ‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్యం : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

by Ratna Kumari |

దిశ, హన్వాడ : ప్రజా ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేయాలనే సంకల్పంతో కృషి చేస్తోందని, ప్రభుత్వం ప్రవేశ

ప్ర‌తి పేద కుటుంబానికి సొంత ఇల్లు క‌ల్పించ‌డ‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్యం : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
X

దిశ, హన్వాడ : ప్రజా ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేయాలనే సంకల్పంతో కృషి చేస్తోందని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా వేలాది నిరాశ్రయ కుటుంబాలకు సురక్షిత గృహాలు లభిస్తున్నాయని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం హన్వాడ మండలం ఇబ్రహీంబాద్ గ్రామంలో నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమానికి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన లక్ష్యమ‌ని, ఇల్లు కేవలం గోడలు, పైకప్పు మాత్రమే కాదు, అది ఒక కుటుంబానికి గౌరవం, భద్రత, స్వాభిమానం కూడా అని ఆయన అన్నారు ప్రతి అర్హుడికి సొంతింటి కల నిజం చేయడమే తమ లక్ష్యం అని తెలిపారు. మహబూబ్ నగర్ నియోజకవర్గం అభివృద్ధి దిశగా సుస్థిర అడుగులు వేస్తోందని, ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు, , రహదారులు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను విస్తృతంగా కల్పిస్తూ సమగ్ర అభివృద్ధి చేస్తున్నామ‌ని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, హన్వాడ మండల కాంగ్రెస్ అధ్యక్షులు వి.మహేందర్, వేముల కృష్ణయ్య, టంకర కృష్ణయ్య యాదవ్, నవనీత, యాదిరెడ్డి, రామకృష్ణ, తహసీల్దార్ కిష్ట్యానాయక్, ఎంపీడీఓ యశోద పాల్గొన్నారు.

Next Story