- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రాక్టర్ ను ఢీ కొట్టిన బైకు.. వ్యక్తికి తీవ్రగాయాలు
దిశ, బిజినేపల్లి : ట్రాక్టర్ వెనుక నుంచి బైకు ఢీ కొట్టడంతో ఓ వ్యక్తికి తీవ్రగాయాలు, మరో వ్యక్తికి స్వల్ప గాయాలైన సంఘటన బిజినేపల్లి మండల పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం

X
దిశ, బిజినేపల్లి : ట్రాక్టర్ వెనుక నుంచి బైకు ఢీ కొట్టడంతో ఓ వ్యక్తికి తీవ్రగాయాలు, మరో వ్యక్తికి స్వల్ప గాయాలైన సంఘటన బిజినేపల్లి మండల పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బిజినేపల్లి మండల కేంద్రం నుంచి మంగనూరు గ్రామానికి చెందిన ట్రాక్టర్ మంగనూరు గ్రామానికి వెళ్తుండగా.. వెనక వైపు నుంచి లట్టుపల్లి గ్రామంలోని ఎర్రకుంట తండాకు చెందిన పాండు నాయక్ బైకుపై వచ్చాడు. ఈ క్రమంలో బైకు పై అతివేగంగా వచ్చిన పాండు నాయక్ ట్రాక్టర్ వెనుక వైపు బలంగా ఢీకొట్టాడు. దీంతో తలకు బలమైన గాయం అయింది. మరొకరికి స్వల్ప గాయాలు కావడంతో ఇది గమనించిన స్థానికులు వెంటనే 108కి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పైలెట్, ఈఎంటి శివకుమార్ గాయపడిన వారిని నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు.
Next Story






