మైన‌ర్ బాలిక పై లైంగిక దాడి.. ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచ‌ల‌న తీర్పు..!

by Ratna Kumari |

దిశ, గద్వాల క్రైమ్/శాంతి నగర్ : మైన‌ర్ బాలిక పై దాడి చేసిన నిందితుడికి 25 ఏళ్ల జైలు శిక్ష, రూ.40వేలు జ‌రిమానా విధించిన సంఘ‌ట‌న శాంతిన‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది.

మైన‌ర్ బాలిక పై లైంగిక దాడి.. ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచ‌ల‌న తీర్పు..!
X

దిశ, గద్వాల క్రైమ్/శాంతి నగర్ : మైన‌ర్ బాలిక పై దాడి చేసిన నిందితుడికి 25 ఏళ్ల జైలు శిక్ష, రూ.40వేలు జ‌రిమానా విధించిన సంఘ‌ట‌న శాంతిన‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. ఎస్పీ టీ. శ్రీనివాస‌రావు తెలిపిన‌ వివ‌రాల ప్ర‌కారం.. శాంతిన‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ లో గ‌త ఏడాది అక్టోబ‌ర్ 10న వ‌డ్డెప‌ల్లి మండ‌లానికి చెందిన ఓ మ‌హిళా త‌న కుమార్తె క‌నిపించ‌డం లేద‌ని శాంతిన‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు క్రైమ్ నంబర్ 124/2024 u/s 64(2)(n), 87 BNS, sec 5(1) r/w 6 POCSO యాక్ట్ 2012 ప్రకారం కేసు నమోదు చేశారు. విచార‌ణలో భాగంగా హిందూపురం ప్రాంతానికి తీసుకెల్లిన‌ట్టు నిర్దార‌ణ అయింది. అనంత‌పూర్ జిల్లా హిందూపురం నివాసి వ‌డ్డె వెంక‌ట‌ర‌మ‌ణ‌(23) ను పోలీసులు గుర్తించి బాధిత బాలిక‌ను తిరిగి త‌ల్లికి అప్ప‌గించారు.

విచార‌ణ పూర్తి చేసిన పోలీసులు కోర్టుకు ఛార్జీషీట్ స‌మ‌ర్పించారు. ట్ర‌య‌ల్ స‌మ‌యంలో సాక్షుల ప‌టిష్ట‌మైన వాంగ్మూలాలు, ద‌ర్యాప్తు అధికారుల నివేదిక‌ల ఆధారంగా నిందితుడిని కోర్టు దోషీగా తేల్చింది.ప‌రిణామాల‌ను స‌మ‌గ్రంగా ప‌రిశీలించిన గ‌ద్వాల ఫాస్ట్ ట్రాక్ స్పెష‌ల్ కోర్టు మెజిస్ట్రేట్ ఎస్. ర‌వికుమార్ తీర్పు చెప్పి వెంక‌ట‌ర‌మ‌ణ‌కు 25 ఏళ్ల జైలు శిక్ష‌, రూ.40వేలు జ‌రిమానా విధిస్తూ తీర్పు వెల్ల‌డించారు. ఈ కేసు ద‌ర్యాప్తులో కీల‌క పాత్ర పోషించిన డీఎస్పీలు స‌త్య‌నారాయ‌ణ‌, మొగిల‌య్య‌, శాంతిన‌గ‌ర్ ఎస్సై నాగ‌శేఖ‌ర్ రెడ్డి, అడిషనల్ పీపీలు శ్రీనివాస్, వినోద్ కుమార్, కోర్టు డ్యూటీ సిబ్బంది ఎస్సై జిక్కి బాబు, హెడ్ కానిస్టేబుల్ సాయి బాబా, కానిస్టేబుల్ గౌస్ పీర్ ల కృషిని ఎస్పీ టి. శ్రీనివాస రావు అభినందించారు.

Next Story