- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పరీక్ష కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలు
జిల్లాలో శుక్రవారం నుండి ప్రారంభమయ్యే పదవ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 (144 సెక్షన్) అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ జానకి ఒక ప్రకటనలో తెలిపారు.

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: జిల్లాలో శుక్రవారం నుండి ప్రారంభమయ్యే పదవ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 (144 సెక్షన్) అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ జానకి ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లాలో జరిగే పదవ తరగతి పరీక్షలు మొత్తం 60 పరీక్షా కేంద్రాల్లో, 12769 మంది విద్యార్థులు పరీక్షలు రానున్నారని ఆమె తెలిపారు.ఈ పరీక్షా కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు,5 గురికి మించి గుంపులుగా ఉండరాదని,ఎలాంటి సభలు,సమావేశాలు,ర్యాలీలు,మైకులు,డిజే లతో ఊరేగింపులు,ధర్నాలు,ప్రచారాలు నిర్వహించరాదని ఆమె పేర్కొన్నారు. పరీక్షలు జరుగుతున్న సమయాల్లో,ఆయా పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్ సెంటర్లు,జీరాక్సు షాపులు,స్టేషనరీ దుకాణాలు మూసి ఉంచాలని ఎస్పీ ఆదేశించారు.అదేవిధంగా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు,పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పరిసర ప్రాంతాల్లో పోలీస్ పెట్రోలింగ్ పార్టీలను నియమించినట్లు ఆమె తెలియజేశారు.ఈ నిషేదాజ్ఞులు ఏప్రిల్ 4వ తేదీ వరకు అమలు ఉంటుందని,నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఆమె హెచ్చరించారు. వివిధ వర్గాల ప్రజలు,ప్రజా సంఘాలు,రాజకీయ పార్టీలు పోలీసులకు సహకరించాలని ఎస్పీ జానకి సూచించారు.






